Reading Time: < 1 minute

కోల్బెల్ట్: చిన్నారికి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

Caption of Image.

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​పట్టణం భగత్​సింగ్​నగర్​కు చెందిన అనాథ బాలిక విజ్జిగిరి అక్షిత చదువులకు అండగా నిలుస్తానని కాంగ్రెస్​ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హామీ ఇచ్చారు. విజ్జిగిరి సతీశ్–-రజిత దంపతులు అనారోగ్య కారణాలతో మృతిచెందగా రక్షిత ఒంటరైంది. ప్రస్తుతం -నానమ్మ వద్ద ఉంటున్న రక్షిత ఐదో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలోనే శనివారం చిన్నారి అక్షిత, ఆమె బంధువులను నల్లాల ఓదెలు కలిశారు. రక్షిత పదో తరగతి వరకు అయ్యే ఖర్చులను తాను భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొంత స్కూల్​ఫీజును చెల్లించారు. ఆయన వెంట కాంగ్రెస్​నేత గాండ్ల సమ్మయ్య, నాయిబ్రహ్మణ సంఘం లీడర్లు ఉన్నారు.    

కాంగ్రెస్​లో సిక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలి

లక్సెట్టిపేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో సిక్కులకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పించాలని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన రాష్ట్ర సిక్కుల ప్రధాన కార్యదర్శి సర్దార్ రంజిత్ సింగ్ కోరారు. ఏఐసీసీ పరిపాలనా ఇన్‌‌చార్జ్ గుర్‌‌దీప్ సింగ్ సప్పల్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్​లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ను కలిసి మాట్లాడారు.​ రాష్ట్రంలో సిక్కు వర్గాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ లో సిక్కులకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు మహేశ్ గౌడ్ సానుకూలంగా స్పందించినట్లు సర్దార్ రంజిత్ సింగ్ తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.