
Roger Federer: 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వీరుడు, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ టెన్నిస్ కోర్టులోకి అడుగు పెడితే ఆ మ్యాజిక్కే వేరు.. 2022లోనే ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, తనలోని టైమింగ్, క్రియేటివిటీ, క్లాస్ ఏమాత్రం తగ్గలేదని ఈ స్విస్ మాస్ట్రో మరోసారి ప్రూవ్ చేశాడు. న్యూపోర్ట్‌లోని ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ వేదికగా జరిగిన హాల్ ఆఫ్ ఫేమ్ సెలబ్రిటీ ప్రో క్లాసిక్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఫెదరర్ కొట్టిన ఓ అద్భుతమైన బిహైండ్ ది బ్యాక్ (వెనుక నుంచి కొట్టిన) ట్రిక్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఫెదరర్ వింటేజ్ మేజిక్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
బిహైండ్ ది బ్యాక్ షాట్:
డబుల్స్ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగుతున్న సమయంలో బంతి వేగంగా రావడంతో రోజర్ ఫెదరర్ చాకచక్యంగా రాకెట్‌ను తన శరీరం వెనుక భాగం నుంచి తిప్పి అద్భుతంగా నెట్ దాటించాడు. ఈ ఊహించని షాట్ చూసి మైదానంలో ఉన్న ప్రేక్షకులు, సహచర ప్లేయర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచిన ఈ మ్యాజికల్ షాట్‌తో స్టేడియం మొత్తం ఈలలు, చప్పట్లతో హోరెత్తిపోయింది.
లెజెండ్స్ సందడి.. గ్రాస్ కోర్టుపై వింటేజ్ వైబ్స్:
ఈ స్టార్ స్టడెడ్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఫెదరర్‌తో పాటు టెన్నిస్ సర్క్యూట్ దిగ్గజాలు జాన్ మెకన్రో, స్టెఫాన్ ఎడ్బర్గ్, లైటన్ హెవిట్, మార్టినా నవరాతిలోవా, బ్రయాన్ బ్రదర్స్ పాల్గొని సందడి చేశారు. గ్రాస్ కోర్టుపై తన కెరీర్‌లో ఏకంగా 8 వింబుల్డన్ టైటిళ్లు గెలిచి సరికొత్త రికార్డులు సృష్టించిన ఫెదరర్.. మళ్లీ అదే గ్రాస్ కోర్టుపై తన ట్రేడ్‌మార్క్ షాట్లతో మెరవడం అభిమానులకు ఒక బ్యూటిఫుల్ నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను అందించింది.
హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవానికి ముందు రోజు మెరుపులు:
ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి అధికారికంగా ప్రవేశించడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ఫెదరర్ ఈ మెరుపులు మెరిపించడం విశేషం. టెన్నిస్ ఆటకు గుడ్‌బై చెప్పినా ఫెడరర్‌లోని క్రేజ్, గ్రేస్ ఎప్పటికీ తగ్గవని ఈ క్లాసిక్ షాట్ మరోసారి నిరూపించింది.
Roger Federer played some grass court tennis today in Newport.
And did THIS.
📽️ ig lisapphire / Lisa Rokhmina pic.twitter.com/SvSdL0VAYL
— José Morgado (@josemorgado) August 29, 2026