Reading Time: 2 minutes
EPFO: ప్రతీ నెలా మీ అకౌంట్లో పీఎఫ్ పడుతుందా..? లేదా..? మొబైల్‌లోనే ఒకే క్లిక్‌తో తెలుసుకోవచ్చు.. ప్రాసెస్ ఇదే..

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఎప్పటికప్పుడు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతీ నెలలో కంపెనీ మీ వాటాతో పాటు యాజమాన్య వాటాను కూడా జమ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు పెన్షన్ అమౌంట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. అయితే మీ కంపెనీ ప్రతీ నెల జమ చేస్తుందా.. లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ జీతానికి తగ్గట్లు పీఎఫ్ అమౌంట్ జమ అవుతుందా.. లేదా అనేది తనిఖీ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఉద్యోగులు చేసేవారు తమ జీతం గురించి ఆలోచిస్తారు తప్పితే పీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోవడం మానేస్తారు. ప్రతీ నెలలో చెక్ చేసుకోవడం వల్ల ఏమైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఏమైనా తప్పులు ఉంటే భవిష్యత్తులో మీరు సరిదిద్దుకోవాలన్నా అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.మీ చేతిలోని మొబైల్ ద్వారా సులువుగా ప్రతీ నెలా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ వాటా, కంపెనీ వాటా, పెన్షన్ అమౌంట్, వడ్డీ వివరాలు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇదెలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా..?

-https://passbook.epfindia.gov.in/MemberPassBook/login పోర్టల్‌కి వెళ్లాలి

-ఆ తర్వాత మీ యూఏఎన్ నెంబర్ నమోదు చేయాలి

-అనంతరం పాస్ట్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్‌పై క్లిక్ చేయాలి

-ఇప్పుడు పాస్ బుక్ పోర్టల్ హోం పేజీలోకి వెళతారు

-పైన కనిపించే పాస్ బుక్ ఆప్షన్ ఎంచుకోండి

-మీ యాజమానికి సంబంధించిన పీఎఫ్ అకౌంట్ నెంబర్ సెలక్ట్ చేసుకోండి

-అక్కడ మీ నెలవారీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలతో పాటు వడ్డీ వివరాలు కూడా కనిపిస్తాయి

ఉమాంగ్ యాప్ ద్వారా చూసుకోవడం ఎలా..?

-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఉమాంగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి

-అనంతరం యాప్ ఓపెన్ చేయండి

-మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి

-ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి

-అనంతరం సెర్చ్ బార్‌లో ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేయండి

-ఈపీఎఫ్‌ఓ సర్వీసెస్‌ను ఎంచుకోండి

-అనంతరం పాస్ బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయండి

-మీ ప్రస్తుతం కంపెనీని ఎంచుకోండి

-అక్కడ మీ పీఎఫ్ వివరాలు కనిపిస్తాయి

ఎస్‌ఎంఎస్, మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోండిలా..

ఇక 9966044425 నెంబర్‌కు ఈపీఎఫ్‌ఓ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఒక రింగ్ తర్వాత కాల్ కట్ అవుతుంది. అనంతరం మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మెస్సేజ్ రూపంలో అందుతాయి. EPFOHO UAN to 7738299899 విధానంలో ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా కూడా బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.