
హైదరాబాద్ లో ఆర్టీసి నైట్ బస్ సర్వీసులు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ఆర్టీసి రాత్రి బస్సు సర్వీసులను నడపనుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ బస్సులు నడుస్తాయి. దీంతో రాత్రుల్లో 11 గంటల తర్వాత బస్సులు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న హైదరాబాదీలకు ఉపశమనం కలగనుంది.
ప్రస్తుతం నైట్ 11 గంటల వరకు ఆర్టీసి బస్సు సర్వీస్ లు నడుస్తున్నాయి. తొలి దశలో 6 ప్రధాన రూట్లలో సర్వీసులు నడపనున్నారు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం.. నైట్ బస్సుల్లో ఫ్రీ జర్నీకి అవకాశం ఇస్తుందా అనే ప్రశ్నలు తలెత్తాయి.
అయితే నైట్ షిఫ్ట్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి 30 నిమిషాల నుంచి గంటకు ఒక బస్సు నడపనున్నట్లు పేర్కొంది.
రాత్రి బస్సు సర్వీసులతో నైట్ షిఫ్ట్ ఉద్యోగులు, ఐటీ సిబ్బంది, హోటల్, షాపింగ్ మాల్స్ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఆలస్యంగా సిటీకి చేరుకునే ప్రయాణికులకు అందుబాటులో నైట్ సర్వీసులు ఉండనున్నాయి.
📍 రూట్ – బస్సు వివరాలు
10H
సికింద్రాబాద్ → హైటెక్ సిటీ → కొండాపూర్
రాత్రి వేళ 30 నిమిషాల నుంచి గంటకు ఒక బస్సు
మొత్తం 8–10 సర్వీసులు అందుబాటులో ఉండే అవకాశం
195W
బాచుపల్లి → వేవ్‌రాక్
రాయదుర్గం, గచ్చిబౌలి, వేవ్‌రాక్ ఐటీ ఉద్యోగులకు ఉపయోగకరం
రాత్రి ప్రతి గంటకు ఒక బస్సు
290U
సికింద్రాబాద్ → హయత్‌నగర్
రైల్వే ప్రయాణికులకు ప్రత్యేకంగా ఉపయోగకరం
సికింద్రాబాద్‌లో ఆల్ఫా హోటల్ ఎదురుగా బస్సు ప్రారంభం
ఎల్బీనగర్, వనస్థలిపురం, ఎన్జీవోస్ కాలనీ మీదుగా సర్వీస్
218
కోఠి → పటాన్‌చెరు
కోఠి, అబిడ్స్ నుంచి పటాన్‌చెరు వరకు రాత్రి సర్వీస్
సాధారణ సమయాల్లో భారీ రద్దీ ఉండే రూట్
222A
కోఠి → హైటెక్ సిటీ → పటాన్‌చెరు
రద్దీకి అనుగుణంగా 30 నిమిషాల నుంచి గంటకు ఒక బస్సు
219
సికింద్రాబాద్ → పటాన్‌చెరు
నైట్ సర్వీస్ కోసం రూట్‌ను పరిశీలించినట్లు అధికారులు వెల్లడి
నైట్ షిఫ్ట్ షెడ్యూల్
ప్రారంభం: రాత్రి 10:00 గంటలు
ముగింపు: ఉదయం 5:00 గంటలు
ఫ్రీక్వెన్సీ: 30 నిమిషాల నుంచి 60 నిమిషాలకు ఒక బస్సు
10H: 8–10 సర్వీసులు
195W: గంటకు ఒక సర్వీస్
మిగిలిన రూట్లు: ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా ఫ్రీక్వెన్సీ