Reading Time: < 1 minute

జగన్కు నమ్మక ద్రోహం చేయలేదు.. సజ్జల కారణంగానే వైసీపీలో సమస్య: విజయసాయి రెడ్డి లేఖ

Caption of Image.

వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన లేఖ విడుదల చేశారు. వైసీపీ కోటరీ తనను నమ్మకద్రోహి అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తోందని 2026 ఆగస్టు 29న విడుదల చేసిన లేఖలో  ప్రస్థావించారు. జగన్‌కు తాను ఎప్పుడూ నమ్మకద్రోహం చేయలేదని, నమ్మకద్రోహమే తన రక్తంలో ఉంటే ఎప్పుడో పార్టీ మారిపోయేవాడినని  పేర్కొన్నారు. జగన్‌ కు నమ్మకస్తుడిననే కారణంతోనే అనేక కేసుల్లో తనను నిందితుడిగా చేర్చారని తెలిపారు.

వైసీపీలో 2020 తర్వాత తనపై పార్టీలో క్రమంగా కుట్రలు, అవమానాలు పెరిగాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనను ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు కోర్ కమిటీ నుంచి కూడా తొలగించారని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కోటరీలో లేను. జగన్‌ దృష్టిలో తన మాటకు ఉన్న విలువను 2020 నుంచి అంచెలంచెలుగా తగ్గించింది ఎవరు?  అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులకు సైతం జగన్‌ను కలవకుండా అడ్డుకున్నది సజ్జలేనని ఆరోపించారు. పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు సజ్జల ఆధ్వర్యంలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనిపై కార్యకర్తలు, జగన్ అభిమానులు ఆలోచించాలని కోరారు.తాను పార్టీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు వేరే పార్టీ పెడుతున్నానని విజయసాయిరెడ్డి తన లేఖలో వెల్లడించారు.   

©️ VIL Media Pvt Ltd.