Reading Time: 2 minutes

జ్యోతిష్యం: పూజకు.. భోజనానికి కుడిచేయినే ఎందుకు వాడతారు…ఆధ్యాత్మికమా..శాస్త్రీయమా.. పురాణాల్లోని రహస్యం ఇదే..!

Caption of Image.

శరీరానికి కుడి చేయి లేదా ఎడమ చేయి రెండు చేతులు శరీరానికి ముఖ్యమైనవి. ఈ సందర్భంలో కుడి చేతికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పూజలైనా, భోజనాలైనా కుడిచేతిని ఉపయోగించమని పెద్దలు చెబుతారు.  కుడి చేయికి ఎందుకు ఇంపార్టెన్స్​ ఉంది. ఇది ఆధ్యాత్మికమా.. శాస్త్రీయమా..?. ఎడమ చేతిని మంచి పనికి ఎందుకు ఉపయోగించకూడదు.. ఈ విషయం గురించి పెద్దలు..పురాణాలు ఏం చెబుతున్నాయోఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

హిందూ సాంప్రదాయంలో పూజలు, దానాలు , ఇతర శుభకార్యాలకు కుడి చేతిని మాత్రమే ఉపయోగించడం వెనుక ఆధ్యాత్మికంగానూ… శాస్త్రీయంగానూ కారణాలున్నాయని పెద్దలు చెబుతున్నారు. సాధారణంగా పూజకు.. భోజనానికి ఎడమచేతిని అస్సలు ఉపయోగించరు.

  సాధారణంగా ఎడమచేతిని వ్యక్తిగత పరిశుభ్రాల కోసం వాడతారు.  మన శరీరాన్ని శుభ్రం చేసుకున్న చేతితో భగవంతుడిని పూజించకూడదని చెబుతారు.  పూజకు ఉపయోగంచని చేతితో ఆహారం కూడా తీసుకోరు.  ఒక్కమాటలో చెప్పాలంటే ఎడమచేతితో దేవుని వస్తువులు కూడా తాకరు.  అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా.  అందుకే ఆహారం తినేందుకు కుడిచేతినే ఉపయోగిస్తారు.  ఇక శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తే మలినాలను శుభ్రం చేసే చేతితో ఆహారం తింటే.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

అందుకే ఎడమ చేతిని ఇంటి పనులు ..  వ్యక్తిగత పనుల కోసం కేటాయించగా..  కుడి చేతిని భోజనం చేయడానికి పూజలు చేయడానికి.. దానం చేయడానికి పవిత్ర  ఆచారాలకోసం ఉపయోగిస్తారు.  సమయంలో పవిత్రతను మరియు దేవుని పట్ల గౌరవాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించేవారు.

ఆయుర్వేద వైద్య శాస్త్రం ప్రకారం మానవ శరీరంలో కుడివైపు  ఇడ, పింగళ అనే సూక్ష్మ నాడులు ఉన్నాయి. ఇవి మెదడులోని ఎడమ భాగాన్ని..  కుడి వైపు శరీరానికి అనుసంధానంగా ఉంటాయి.  ఇవి శాస్త్రీయంగాసానుకూల భావోద్వేగాలను పెంపొందించడంలో సహాయపడతాయి. అందుకే జీవితంలో ముఖ్యమైన పనులన్నీ , కుడి చేతితో చేయాలని పెద్దలు చెబుతారు. 

కుడి చేతితో ఆశీర్వదించినప్పుడు, ఆ శక్తి ఆశీర్వాదం పొందే వ్యక్తికి చేరడమే కాకుండా ఆశీర్వదించే వ్యక్తికి కూడా ఒక విధమైన శక్తి లభిస్తుంది. మన సంప్రదాయంలో పూజలు, హారతి, విభూతి ధారణ వంటి శుభ కార్యాలతోపాటు.. దేవునికి నైవేద్యాలు సమర్పించడానికి .. ఆశీర్వాదాలు పొందడానికి కుడి చేతిని ఉపయోగిస్తారు.సంస్కృతంలో కుడి చేతిని దక్షిణ అని అంటారు.  పురాణాల ప్రకారం దక్షిణ అంటే పెద్దలను సన్మానించడం.. గౌరవించడం అని అర్దం. అలాంటిశుభకార్యాలకు కూడా కుడిచేతినే ఉపయోగిస్తారని పెద్దలు చెబుతున్నారు. 

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మన శరీరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే.. కుడి భాగం సూర్యుడికి..  ఎడమ భాగం చంద్రుడికి ప్రతీకగా నిలుస్తాయి. కుడి చేయి సూర్య శక్తికి అనుసంధానమై ఉంటుంది. అందువల్ల కుడి చేతితో ఆశీర్వదించడం వల్ల సానుకూల శక్తులు ప్రసరిస్తాయి.  ఇవి శ్రేయస్సు, దాతృత్వం , ధర్మానికి చిహ్నాలుగా పరిగణిస్తారు. కుడి చేతితో దానం చేయడం వల్ల ఈ గ్రహాల నుండి ఆశీర్వాదాలు వస్తాయి, ఇది అదృష్టానికి దారితీస్తుంది . ప్రతికూల కర్మ పరిణామాల నుండి రక్షణను అందిస్తుంది.

ఎడమ చేయి చంద్రుడు , రాహువు తో ప్రభావితమవుతుంది. ఈ శక్తులు అస్థిరంగా ఉంటాయి. ఎడమ చేతితో దానం చేయడం స్వార్థం లేదా అగౌరవాన్ని సూచిస్తుంది, ఇది కర్మ ప్రయోజనాలను తగ్గిస్తుంది. మరోవైపు, కుడి చేతితో దానం చేయడం కర్మను సమతుల్యం చేస్తుందని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.