Reading Time: < 1 minute

దళితులు గుళ్లకు పోతే… బీజేపీ గుళ్లు శుద్ధి చేస్తోంది.. ఇదీ దేశంలో రియాలిటీ: రాహుల్ గాంధీ

Caption of Image.

దళితుల పట్ల బీజేపీ ఇప్పటికీ వివక్ష చూపిస్తోందంటూ మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. శనివారం ( ఆగస్టు 29 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు ఘాటైన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.దళితులు గుళ్లకు పొతే.. బీజేపీ నేతలు గుళ్ళు శుద్ధి చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగం హక్కులు కలిపించినప్పటికీ దళితులు వివక్ష, ఉల్లంఘనలను ఎదుర్కొంటూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.

బీజేపీ , ఆర్‌ఎస్‌ఎస్‌లు అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు రాహుల్ గాంధీ. దేశం నిరంతర సైద్ధాంతిక పోరాటానికి సాక్ష్యమవుతోందని, దళితులు వేల సంవత్సరాలుగా వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం వివక్ష చట్టవిరుద్ధమైనప్పటికీ.. ప్రతి దశలో దళితులు వివక్ష ఎదుర్కొంటున్నారని అన్నారు.దళితులు ఎంత విజయం సాధిస్తే.. వారిపై అంతగా దాడులు జరుగుతాయని అన్నారు.

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఉత్తరాఖండ్ పర్యటన అనంతరం ‘శుద్ధికరణ’పై ఇటీవల చెలరేగిన వివాదాన్ని దళితులు ఎదుర్కొంటున్న వివక్షకు ఉదాహరణ అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు అంటరానితనాన్ని ఇంకా పాటిస్తున్నారని అన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.