Reading Time: < 1 minute

ఎల్ ఐసీ ఆధ్వర్యంలో నేషనల్ స్పోర్ట్స్ డే.. మూడు రోజుల పాటు స్పోర్ట్స్ కాంపిటేషన్స్

Caption of Image.
  •     మేజర్ ధ్యాన్‌‌‌‌చంద్ జయంతి సందర్భంగా 28 నుంచి 30 వరకు ఇండోర్, ఔట్‌‌‌‌డోర్ స్పోర్ట్స్

హైదరాబాద్, వెలుగు : హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌‌‌‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నట్లు ఎల్‌‌‌‌ఐసీ ప్రకటించింది. 

ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగించనుంది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ఎల్‌‌‌‌ఐసీ కార్యాలయాల్లో ఉద్యోగుల కోసం ఇండోర్, ఔట్‌‌‌‌డోర్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. 

ఉద్యోగుల్లో శారీరక ధృఢత్వంపై అవగాహన పెంచడంతో పాటు రోజువారీ జీవితంలో ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ను భాగం చేసుకునేలా ప్రోత్సహించడమే కార్యక్రమాల ఉద్దేశమని ఎల్‌‌‌‌ఐసీ సంస్థ తెలిపింది. ముంబైలోని ఎల్‌‌‌‌ఐసీ కార్యాలయంలో శనివారం ఇండోర్ స్పోర్ట్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

©️ VIL Media Pvt Ltd.