Reading Time: < 1 minute

రైలులో ప్రయాణిస్తున్నారా ? మీ సీటు కన్ఫర్మ్ అయిందో లేదో ఇలా ఈజీగా తెలుసుకోండి !

Caption of Image.

ఆర్ఏసీ (RAC) టిక్కెట్‌తో రైలు ప్రయాణం చేసేవారికి గుడ్ న్యూస్. చాలా మందికి కన్ఫర్మ్ టిక్కెట్టే కావాలని కోరుకుంటారు. కానీ టిక్కెట్‌పై “RAC” అని వస్తే ప్రయాణం వరకు ఒకలాంటి టెన్షన్ ఉంటుంది. అసలు ఆర్ఏసీ టికెట్‌పై ప్రయాణం చేయవచ్చా అంటే.. ఖచ్చితంగా చేయవచ్చు. కాకపోతే మీకు ఫుల్ బెర్త్ రాదు, ఇంకొకరితో కలిసి కూర్చోవడానికి సీటు ఇస్తారు. ఒకవేళ ప్రయాణంలో ఎవరైనా ప్రయాణికులు రాకపోతే లేదా సీటు ఖాళీ అయితే మీకు  ఫుల్ బెర్త్ దక్కే అవకాశం ఉంటుంది.

 సీటు కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా?
PNR స్టేటస్ చెక్ చేయడం: మీ టిక్కెట్‌పై ఉండే 10 అంకెల PNR నంబర్‌ను IRCTC యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి స్టేటస్ చూసుకోవచ్చు. ఒకవేళ అక్కడ ‘CNF’ (Confirmed) అని వస్తే మీకు ఫుల్ సీటు దొరికినట్లే. ఒకవేళ ‘RAC’ అనే ఉంటే ఇంకొంతసేపు వేచి చూడాలి.

 TTE ని సంప్రదించడం: మీ దగ్గర ఇంటర్నెట్ లేకపోయినా లేదా ఆన్‌లైన్‌లో చెక్ చేయడం రాకపోయినా నేరుగా TTE (టికెట్ కలెక్టర్)ను కలవవచ్చు. వారి దగ్గర ఫుల్ చార్ట్ ఉంటుంది కాబట్టి ఏ సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఎవరికి కేటాయించాలనే పూర్తి సమాచారం వారికీ తెలుస్తుంది.

గుర్తుంచుకోవాల్సినవి :
చార్ట్ రెడీ అయినా తర్వాత కూడా  : చార్ట్ ప్రిపేర్ అయిపోయినా సరే చాలా మంది చివరి నిమిషంలో టికెట్లు క్యాన్సల్ చేసుకుంటుంటారు. కాబట్టి రైలు ఎక్కిన తర్వాత కూడా ఆర్ఏసీ సీట్లు కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

ఖాళీ సీటు కనిపిస్తే : ట్రైన్‌లో ఎక్కడైనా సీటు ఖాళీగా కనిపిస్తే వెంటనే వెళ్లి కూర్చోకూడదు. ఆ సీటు ఎవరికి కేటాయించారు, వేరే స్టేషన్‌లో ఎవరైనా ఎక్కుతారా అనే విషయం TTE కి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ముందుగా టీటీఈని అడిగి అనుమతి తీసుకోవడం మంచిది.
  
 

©️ VIL Media Pvt Ltd.