
ఏపీలో కరువు ప్రాంతాలైన ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారమైంది.పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మూడు దశాబ్దాల తర్వాత పూర్తయింది. కృష్ణా వరద జలాలను శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్‌లోని కొల్లంవాగు నుంచి నల్లమల కొండల కిందుగా జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు తరలించే ఈ భారీ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిస్థాయి వినియోగానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు 1996 మార్చి 5న సీఎం చంద్రబాబు గొట్టిపడియ దగ్గర శంకుస్థాపన చేశారు.
సీఎంగావెలుగొండ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేసిన చంద్రబాబు అదే హోదాలో సోమవారం ( ఆగస్టు31 ) ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును క్లిష్ట సమయంలో నిర్మించే బాధ్యతలు చేపట్టిన MEIL 11.175 కిలోమీటర్ల సొరంగాల నిర్మాణాన్ని పూర్తి చేసింది. పలు అనుబంధ నిర్మాణాలను కూడా పూర్తి చేసింది ఈ సంస్థ.
శంకుస్థాపన నుంచి ప్రాజెక్టు పూర్తి వరకు
సీఎం చంద్రబాబు 1996 మార్చి 5న శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు.. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత పూర్తయింది. కరవు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో మొదలైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు భారీ జలరవాణా వ్యవస్థగా రూపుదిద్దుకుంది.
శంకుస్థాపన చేసిన నాయకుడిగా చంద్రబాబు విజన్ కి ఈ ప్రాజెక్టు ప్రతీకగా నిలుస్తోంది. ఎవరైతే ప్రాజెక్ట్ కు తొలుత శంఖుస్థాపన చేశారో అదే నేత ప్రాజెక్ట్ ను ప్రారంభించనుండటం విశేషం.
కృష్ణా జలాలకు జంట సొరంగాలు
శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్‌లోని కొల్లంవాగు నుంచి కృష్ణా వరద జలాలను తీసుకుని నల్లమల సాగర్‌కు తరలించడం ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. మొత్తం 43.50 టీఎంసీల కృష్ణా వరద జలాలను వినియోగించుకునేలా ప్రాజెక్టును రూపొందించారు. సుంకేసుల, గొట్టిపడియా, కాకర్ల గ్యాప్‌లను మూసివేయడం ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశారు.
దీని సామర్థ్యం 53.85 టీఎంసీలు. జంట సొరంగాలు కలిపి సెకనుకు 328 ఘన మీటర్ల నీటిని తరలించే సామర్థ్యంతో ఉన్నాయి. ఈ సొరంగాలను టిబిఎం ద్వారా తవ్వే సమయంలో వచ్చే మట్టిని తరలించేందుకు ఆసియాలోనే పొడవైన 37 కిలోమీటర్ల కన్వేయర్ బెల్ట్ ను ఉపయోగించారు.