Reading Time: < 1 minute

ఇకపై ఫాస్టాగ్ నుంచే ట్రాఫిక్ చలాన్లు కట్ ?.. హైదరాబాద్ పోలీసుల కొత్త రూల్ రాబోతోంది!

Caption of Image.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ చలాన్ల వసూలుకు సంబంధించి  భవిష్యత్తులో వాహనాల ట్రాఫిక్ చలాన్లను నేరుగా వారి ఫాస్టాగ్ (FASTag) అకౌంట్ నుంచే కట్ చేసుకునే విధానంపై పోలీసులు ఆలోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)తో చర్చలు జరుగుతున్నాయని, వారి నుంచి అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్ తెలిపారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

ప్రయాణికుల్లో మార్పు రావాలి:
కేవలం చలాన్లు వేయడం వల్ల మాత్రమే ప్రజల్లో మార్పు రాదని, సాంకేతికతను ఉపయోగించి బాధ్యతాయుతమైన డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో జనాభా, వాహనాలు పెరిగినట్లే ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇతర ముఖ్యమైన సూచనలు:
లాస్ట్-మైల్ కనెక్టివిటీ: ప్రజలు సొంత వాహనాలు వాడకుండా ప్రజా రవాణా (మెట్రోలు, బస్సులు) ఎక్కువగా వాడేలా చేయాలంటే, వాటికి అనుసంధానంగా రవాణా సేవలను మరింత బలోపేతం చేయాలి.

మెరుగైన పార్కింగ్: ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి నగరంలో చాల చోట్ల మల్టీ-లెవెల్ (బహుళ అంతస్తుల) పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.  రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యతే కాదని, ప్రభుత్వ సంస్థలు, టెక్నాలజీ నిపుణులు, ప్రజలందరూ కలిసి పనిచేస్తేనే హైదరాబాద్ రోడ్లను సురక్షితంగా మార్చగలమని ఆయన స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.