
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ (ఇండియా పోస్ట్) దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్స్, డివిజన్లలోని పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్-II, 2026, జులై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్ మెంట్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు పేరు: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్.
ఎలిజిబిలిటీ:
*గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
*అభ్యర్థులు కనీసం పదోతరగతి వరకు స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
*కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
*జీడీఎస్ అలవెన్సులతోపాటు జీవనోపాధికి తగిన ఇతర మార్గాలు/ఆదాయవనరులు కలిగి ఉండాలి. ఈ మేరకు నియామక సమయంలో అభ్యర్థులు డిక్లరేషన్ లేదా అండర్ టేకింగ్ సమర్పించాల్సి ఉంటుంది.
వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితి లో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా..
ఆన్ లైన్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్: ఆగస్టు 31- సెప్టెం బర్ 19.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 2
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులు రూ.100 చెల్లించాలి.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 21,
మరిన్ని వివరాలకు వెబ్సైట్ indiapost.gov.inను సందర్శించండి.
సెలెక్షన్ ప్రాసెస్
సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ పదో తరగతి పరీక్షలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్లు/పాయింట్లు ఆధారంగా రూపొందిస్తారు.
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు ఎంగేజింగ్ అథారిటీ (డివి జనల్ / యూనిట్ హెడ్) ఆధ్వర్యంలో ఒరిజినల్ సర్టిఫికెట్ ఫిజికల్ వెరిఫికేషన్ కు హాజరుకావాలి. ఆ తర్వాత ప్రొవిజనల్ నియామక ఆఫర్ అందజేస్తారు.
శాఖ నిర్వహణ, బాధ్యతలు
*ఒకే వ్యక్తి నిర్వహించే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ మొత్తానికి అభ్యర్దే ఇన్ఛార్జ్ గా వ్యవహరించాలి.
*బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ రోజువారీ కార్యకలాపాలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) లావాదేవీలు, శాఖ సేవలను విస్తృతంగా మార్కెటింగ్/ప్రచారం చేయడం వీరి ప్రధాన విధి.
*పోస్టల్ మెయిల్ రవాణా, వాటి పంపిణీ బాధ్యతలను కూడా అభ్యర్దే చూసుకోవాలి.
*బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నిర్వహణ కోసం అభ్యర్థ స్వయంగా వసతిని ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా, సంబంధిత పోస్ట్ గ్రామంలోనే విధిగా నివాసం ఉండాలి.