
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సోదరులకు రాఖీ కట్టటం మన సంప్రదాయం. సొంత అన్న కాకపోయినా సోదరుడిగా భావించే అందరికీ రాఖీ కట్టటం సహజం. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క. 2026, ఆగస్ట్ 28వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మహిళా మంత్రులు మంత్రి సురేఖ, సీతక్క.. సీఎం రేవంత్ రెడ్డి చేతికి రక్షా బంధన్ కట్టారు.
కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద కామెంట్స్ చేశారు. పరకాల సీటు విషయంపై ఛాలెంజ్ చేశారు. ఈ పరిణామాలతో పార్టీలోని అసమ్మతి భగ్గుమన్నది. కొండా సురేఖ ఫ్యామిలీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విప్ లు ప్రెస్ మీట్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చారు. కొండా సురేఖను మంత్రిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ క్రమ శిక్షణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చారు కొందరు ఎమ్మెల్యేలు.
ఈ పరిణామాల క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికెళ్లి.. ఆయనకు మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టటం అనేది చర్చనీయాంశం అయ్యింది.