Reading Time: 3 minutes
ఆగస్టు 28 రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి విషయాల్లో శుభవార్తలు..

దిన ఫలాలు (ఆగస్టు 28, 2026): మేష రాశి వారికి అనారోగ్య సమస్యలుండే అవకాశం ఉంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు కొన్ని శుభవార్తలు అందుతాయి. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. మిథున రాశి వారికి కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఆలస్యంగా లేదా అసంపూర్తిగా పూర్తవుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లోనే కాక కుటుంబంలో కూడా బాగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలు బాగా తగ్గిపోతాయి. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. అనారోగ్య సమస్యలుండే అవకాశం ఉంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు కొన్ని శుభవార్తలు అందుతాయి. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. విదేశీయానానికి, విదేశాల్లో స్థిరపడడానికి అవకాశాలు మెరుగుపడ తాయి. అనుకోకుండా ధన యోగం పడుతుంది. సేవా కార్యక్రమాల్లోనూ, సహాయ కార్యక్రమా ల్లోనూ పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగాఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఆలస్యంగా లేదా అసంపూర్తిగా పూర్తవుతాయి.ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. నిదానంగా బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. వృత్తి, ఉద్యో గాల్లో కూడా పని భారం పెరిగే అవకాశం ఉంది. ఆదాయం కలిసి వస్తుంది కానీ, సంతృప్తికరంగా ఉండదు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు సామరస్యంగా సాగిపోతుంది. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కొందరు బంధువుల సహకారంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాలు బాగా లాభ సాటిగా పురోగమిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా చక్కబడతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సర దాగా కాలక్షేపం చేస్తారు. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. కొద్దిగా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ప్రత్యేక బాధ్యతల్ని అప్పగిస్తారు. అధికారాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. కుటుంబ వ్యవహారాలను జీవిత భాగస్వామి సహాయంతో చక్కదిద్దుతారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యో గంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు. ముఖ్యంగా వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కొందరు మిత్రులతో విందులో పాల్గొంటారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో శ్రమ, తిప్పట ఉంటాయి. ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాదు. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ సేవల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో తిప్పట తప్పకపోవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుం టారు కానీ, ఇతరులకు సహాయం చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపో తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటిమిత్రుల్ని కలుసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు సజావుగానే సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇంటా బయటా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. కొందరు స్నేహితులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు హాజరవుతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ముఖ్యమైన ఆదాయ మార్గాల మీద శ్రద్ధ పెడతారు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, లాభదాయకంగా సాగుతాయి. కొత్త వ్యాపారాలు లేదా కొత్త పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరాభిమానాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో కొన్ని ఆలయాలు సందర్శిస్తారు.