
బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. కృతి సనన్ రక్షా బంధన్ యాడ్‌లో ధరించిన దుస్తులపై కంగనా చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న వేళ.. ఆమె గతంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్న సమయంలోని వీడియో, ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో కంగనా, కృతి సనన్ అవార్డులు అందుకున్న సమయంలో ధరించిన దుస్తులను పోలుస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సాంస్కృతిక సంప్రదాయాలు, పండుగల సందర్భాల్లో మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలనే అంశంపై కంగనా చేసిన వ్యాఖ్యలను.. ఆమె గతంలో బహిరంగ కార్యక్రమాల్లో కనిపించిన తీరుతో పోల్చి సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యంగా కృతి సనన్ రక్షా బంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు చేసిన కొద్ది రోజులకే ఈ పాత వీడియో వెలుగులోకి రావడం చర్చకు దారితీసింది.
నేషనల్ అవార్డ్ వేడుకలో కంగనా లుక్
వైరల్ అవుతున్న దృశ్యాలు 63వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు సంబంధించినవి. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కంగనా రనౌత్ ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ చిత్రానికి ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కంగనా పాస్టెల్ పింక్ రంగులోని ఆఫ్-షోల్డర్ గౌన్ ధరించారు. ఈ దుస్తులను బీరూట్‌కు చెందిన లెబనీస్ డిజైనర్ జార్జెస్ చక్రా డిజైన్ చేశారు.
కంగనా, కృతి సనన్ నేషనల్ అవార్డులు అందుకుంటున్న దృశ్యాలను కొందరు నెటిజన్లు పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సాంస్కృతికంగా ముఖ్యమైన సందర్భాల్లో మహిళలు ఎలా దుస్తులు ధరించాలనే అంశంపై వ్యాఖ్యలు చేసే కంగనా.. తన గత దుస్తులను కూడా ఒకసారి పరిశీలించుకోవాలని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
కంగనా వర్సెస్ కృతి
ఓ సోషల్ మీడియా యూజర్ కంగనా, కృతి అవార్డులు అందుకుంటున్న ఫొటోలను షేర్ చేస్తూ.. సంస్కృతి, దుస్తులపై వ్యాఖ్యలు చేసే కంగనా ముందుగా తనను తాను పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. మరో యూజర్ ఇద్దరు నటీమణుల దుస్తులను పోలుస్తూ.. రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు అందుకునే సమయంలో వారి డ్రెస్సింగ్‌పై చర్చకు తెరలేపారు. ఇంకొందరు కంగనా, కృతి సనన్‌తో పాటు రాణి ముఖర్జీ, అలియా భట్, తదితర నటీమణులు నేషనల్ అవార్డులు అందుకున్న సమయంలోని ఫొటోలను కలిపి పోస్టులు చేశారు. కృతి నుంచి ఎంతో మంది హీరోయిన్లు చీరలను ఎంచుకున్నారని.. కంగనా మాత్రం భిన్నమైన దుస్తుల్లో కనిపించారని ధ్వజమెత్తారు.
అయితే.. కంగనా గతంలో చీర ధరించి కూడా నేషనల్ అవార్డు అందుకున్న విషయాన్ని కొందరు నెటిజన్లు గుర్తుచేశారు. 67వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రానికి ఉత్తమ నటి అవార్డును అందుకున్న సమయంలో కంగనా చీరలో కనిపించారు.
అసలు కంగనాపై విమర్శలు ఎందుకు?
కృతి సనన్ నటించిన గివా జువెలరీ రక్షా బంధన్ యాడ్‌పై కంగనా చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఆ యాడ్‌లో కృతి ధరించిన దుస్తులపై కంగనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన సోదరుడికి రాఖీ కడుతున్న సమయంలో బ్రాలెట్ తరహా బ్లౌజ్ ధరించడం అవసరమా? అని ప్రశ్నించారు. మతపరమైన, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న పండుగలో పాల్గొనే సమయంలో మహిళలు ఇతర రకాల దుస్తులను ఎందుకు ఎంచుకోకూడదని కంగనా ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ కలిగి ఉండాలని కృతి తరఫున మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది.
‘కృతిని వ్యక్తిగతంగా విమర్శించలేదు’
తాజాగా డీడీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను కృతిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోలేదని.. పండుగలను చూపించే విధానం, వాటి వెనుక ఉన్న సాంస్కృతిక నేపథ్యం గురించి మాత్రమే మాట్లాడానని తెలిపారు. “వారు ఎలాంటి దుస్తులు ధరించాలనుకుంటే అలా ధరించకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? మనం చూస్తున్న సినిమాల్లో వారు ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారో అందరికీ తెలుసు. వారు ఏం వేసుకున్నారనే విషయం గురించి ఎవరు పట్టించుకుంటారు?” అని కంగనా వ్యాఖ్యానించారు. పండుగలకు సంబంధించిన దుస్తులు, అలంకరణలను వాటి సాంస్కృతిక ప్రాధాన్యం నుంచి పూర్తిగా వేరు చేయలేమని ఆమె పేర్కొన్నారు. రక్షా బంధన్ గురించి మాట్లాడుతూ.. ఈ పండుగకు ప్రత్యేకమైన సంప్రదాయాలు, సాంస్కృతిక పరిమితులు ఉన్నాయని కంగనా అన్నారు. యాడ్‌లో సంప్రదాయ అంశాలు కనిపించకపోవడంపైనే తన ప్రధాన అభ్యంతరమని కంగనా వివరించారు. బ్రాలెట్ తరహా బ్లౌజ్ అనేది పెద్ద సమస్యలో ఒక చిన్న భాగం మాత్రమేనని.. అసలు విషయం పండుగను సంస్కృతి, నాగరికతకు ప్రతిబింబంగా చూడటమేనని తెలిపారు.
ఈ వివాదం తర్వాత సదరు యాడ్‌ను తొలగించారు. భారతీయ పండుగలను ప్రకటనల్లో ఎలా చూపించాలి? మహిళల దుస్తులపై వ్యాఖ్యానించే హక్కు ఎవరికి ఉంది? అనే అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు కంగనా గత నేషనల్ అవార్డ్ లుక్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. ఇతర మహిళల దుస్తులపై కంగనా మాట్లాడే ముందు.. గతంలో ఎలాంటి దుస్తులు ధరించారో గుర్తించుకోవాలని హితవు పలుకుతున్నారు.
Kriti Senon vs Kangana Ranuat
Look and compare their dressing culture in front of Hon’ble President of India while receiveing the National Awards.
Actually BJP IT cell has made India authauthoritarian state, they are scared of th loss of their leader’s power, so they want to… pic.twitter.com/Zxr7f72wrZ
—
Priyanshi for RaGa
Die hard Messi Fan (@RaGakiDeewani) August 26, 2026
From Kriti Sanon to Keerthy Suresh, sarees were chosen while receiving National Awards.
Then there’s Kangana RanautNothing wrong with any outfit, but given her obsession with policing women’s clothes, she’s hardly in a position to lecture others about dressing
pic.twitter.com/CvTGCN4OQ1
— СауравX (@HereToTroll72) August 26, 2026
संस्कार और पहनावे पर ज्ञान देने वाली देवी कंगना रनौत को पहले खुद के अंदर झांकने की जरूरत है।
कृति सैनन के ऐड वाले विवाद पर कंगना रनौत ने उनके कपड़ो को लेकर खूब आलोचना की।
राहुल गांधी ने जब कृति सैनन का पक्ष लिया तो कंगना ने राहुल गांधी को सनातन विरोधी माइंडसेट का बता दिया।
ये… pic.twitter.com/XL310PziuH
— Jaiky Yadav (@JaikyYadav16) August 27, 2026
Priyanshi for RaGa