July 17, 2026

Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు

Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
Reading Time: < 1 minute
Vijay Jana Nayagan Confirms Release Date Other Tamil Films Postponed

తమిళనాడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జన నాయగన్ ఆగమనానికి డేట్ ఫిక్సైంది. జులై 23న సీఎం సాబ్ తన లాస్ట్ మూవీతో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి రావాల్సిన ఈ బొమ్మ.. సెన్సార్ ఇష్యూ వల్ల వాయిదా పడింది. తాజాగా సీబీఎఫ్సీ రూట్ క్లియర్ చేయడంతో ఎట్టకేలకు తమిళ తంబీల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాతో విజయ్‌కు గుడ్ సెండాఫ్ ఇచ్చేందుకు హోల్ ఇండస్ట్రీ సిద్ధమైంది. ఇప్పటికే జులై ఎండింగ్‌లో రిలీజ్ డేట్ ఫిక్సైన సినిమాలన్నీ వాయిదా వేసుకుంటున్నాయి.

జీవీ ప్రకాష్ తాను హీరోగా నటించిన ఇమ్మోర్టల్ మూవీ జులై 23న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ఎనౌన్స్ చేశాడు. ఎప్పుడైతే విజయ్ వస్తున్నాడని తెలిసిందో.. వెంటనే వాయిదా వేసుకుని తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ కనబర్చాడు. సెప్టెంబర్ 4కి మూవీని పోస్ట్ పోన్ చేశాడు. జూన్ 24న కీర్తి సురేష్ సత్యవాన్ సావిత్రి కూడా రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. అయితే విజయ్ వస్తున్నాడని తెలిసే టీం సైలైంట్ అయ్యిందని తెలుస్తోంది. లియోతో విజయ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ కూడా సీఎం సాబ్‌కు రూట్ క్లియర్ చేశాడు. లోకీ హీరోగా నటిస్తోన్న డీసీ జులై 31న విడుదల కావాల్సి ఉండగా.. తాజాగా పోస్ట్ పోన్ చేసుకుంది. సెన్సార్ ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ జారీ చేయగా.. విజయ్ కోసం వన్ వీక్ వాయిదా వేసుకున్నాడు. ఆగస్ట్ 7న డీసీ మూవీ రాబోతుంది. ఇక చెప్పాల్సింది సన్ జాసన్ సంజయ్యే. జులై 31న తన డైరోక్టోరియల్ డెబ్యూ ఫిల్మ్ సిగ్మా రిలీజ్ కావాల్సి ఉండగా.. ప్రమోషన్స్‌ హడావుడి పెద్దగా కనిపించడం లేదు. తండ్రితో పోటీ వద్దనుకుని తప్పుకున్నట్లే కనిపిస్తున్నాడు. ప్రొడక్షన్ హౌస్ లైకా త్వరలో రివీల్ చేస్తుందేమో చూడాలి.