July 17, 2026

NEET-2026 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల.. స్టూడెంట్స్ ఇలా చెక్ చేసుకోండి

NEET-2026 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల.. స్టూడెంట్స్ ఇలా చెక్ చేసుకోండి
Reading Time: 2 minutes

NEET-2026 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల.. స్టూడెంట్స్ ఇలా చెక్ చేసుకోండి

Caption of Image.

వైద్య విద్య కోసం NEET-2026 ఎంట్రెన్స్ పరీక్ష రాసి.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. UGC NEET-2026  ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసింది NTA. గురువారం (జులై 16) సాయంత్రం ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీఏ.. అఫీషియల్ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలని సూచించింది.

ప్రొవిజనల్ ఆన్సర్ కీ వ్యతిరేకంగా సమర్పించిన అభ్యంతరాలను రివ్యూ చేసిన తర్వాత ఫైనల్ కీని తయారు చేసింది ఎన్టీఏ. ఈ కీ ఆధారంగా నీట్ (యూజీ) 2026 రిజల్ట్స్ కు ఈ కీని ఉపయోగించనున్నారు. 

ఫైనల్ ఆన్సర్ కీ ఎలా చూడాలి..?

NEET అఫీషియల్  వెబ్‌సైట్‌ https://neet.nta.nic.in/  ద్వారా  ఆన్సర్ కీ చూడాల్సి ఉంటుంది.

హోమ్‌పేజీలో  NEET (UG) 2026 Final Answer Key లింక్‌పై క్లిక్ చేయండి.

ఆన్సర్ కీ PDF స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది.

ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం PDFని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి.

మీ క్వశ్చన్ పేపర్ కు కీ పేపర్ వర్తిస్తే..  మీ ప్రశ్నపత్రం కోడ్ ప్రకారం ఆన్సర్స్ చెక్ చేసుకోండి. 

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ 2026  వివరాలు

ప్రొవిజనల్ ఆన్సర్ కీ పైన అభ్యర్థుల  అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఫైనల్ కీ విడుదల చేశారు. ఇక అభ్యర్థుల నుంచి ఈ కీ విషయంలో అభ్యంతరాలు స్వీకరించడం ఉండదు. ఫైనల్ రిజల్ట్స్, అడ్మిషన్  సంబంధిత అంశాల కోసం  అభ్యర్థులు అధికారిక పోర్టల్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.  ఆన్సర్ కీని అధికారిక నీట్ పోర్టల్ నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

►ALSO READ | బీటెక్, ఎంటెక్ చేసినోళ్లకు గుడ్ న్యూస్.. NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు..

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్ యూజీ’ రీ- ఎగ్జామ్ కోసం  దేశ వ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.  దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఎగ్జామ్ సెంటర్లలో పరీక్ష నిర్వహించారు.  

పేపర్ లీకేజీ కారణంగా  తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఎన్టీఏ.. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా సుమారు 2 లక్షల మంది సిబ్బందిని పరీక్షా విధుల్లో మోహరించారు. ఇందులో 674 మంది సిటీ కో ఆర్డినేటర్లు, 6,669 మంది అబ్జర్వర్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇన్విజిలేటర్లు పర్యవేక్షణలో పరీక్ష జరిగింది. 

©️ VIL Media Pvt Ltd.