July 17, 2026

వామ్మో..! ఈ ఫేమస్ టీ పొడిని కూడా కల్తీ చేస్తున్నారా ..? మంచిర్యాలలో జరిగింది చూస్తే…!

వామ్మో..! ఈ ఫేమస్ టీ పొడిని కూడా కల్తీ చేస్తున్నారా ..? మంచిర్యాలలో జరిగింది చూస్తే...!
Reading Time: < 1 minute

వామ్మో..! ఈ ఫేమస్ టీ పొడిని కూడా కల్తీ చేస్తున్నారా ..? మంచిర్యాలలో జరిగింది చూస్తే…!

Caption of Image.

జెమినీ టీ… ఈ బ్రాండ్ తెలియని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీ అంటే జెమినీ టీనే అని ఫీల్ అయ్యేవారు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడంటే రకరకాల బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి కానీ.. ఒకప్పుడు మార్కెట్లో ఉన్న కొద్ది బ్రాండ్లలో జెమినీ టీ సేల్స్ టాప్ లో ఉండేవి. ఈ బ్రాండ్ కి ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు.. అలాంటోళ్లకు గుండె పగిలిపోయే వార్త ఇది. జెమిని టీ పొడిని కూడా కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. మంచిర్యాల జిల్లాలో ఈ కల్తీ బాగోతం బయటపడింది.

మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ లోని మహేశ్వర ట్రేడర్స్ నుండి గోలేటి కీ అక్రమంగా తరలిస్తున్న నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పట్టుకున్నారు పోలీసులు. టోల్ గేట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా… నకిలీ టీ పొడి పట్టుబడింది.పట్టుకున్న నకిలీ జెమిని చాయా పత్తి రెండు బాక్స్ లను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించిన పోలీసులు..

►ALSO READ | దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో… 44 శాతం తెలంగాణలోనే: డీజీపీ సీవీ ఆనంద్ 

నకిలీ చాయ్ పత్తి నీ సీజ్ చేసి షాపు యాజమానికీ నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఈరోజుల్లో ఏది నకిలీ.. ఏది అసలు కనిపెట్టడం కష్టమైపోతోందని.. ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు చేపట్టి నకిలీ మార్కెట్ ను అరికట్టాలని కోరుతున్నారు జనం.

©️ VIL Media Pvt Ltd.