July 16, 2026

సర్.. గడువు పొడిగింపు..ఆగస్టు3 వరకు ఎన్యుమరేషన్ఫారాల ఇవ్వొచ్చు

సర్.. గడువు పొడిగింపు..ఆగస్టు3 వరకు ఎన్యుమరేషన్ఫారాల ఇవ్వొచ్చు
Reading Time: < 1 minute

సర్.. గడువు పొడిగింపు..ఆగస్టు3 వరకు ఎన్యుమరేషన్ఫారాల ఇవ్వొచ్చు

Caption of Image.
  • ఆగస్టు 10 – సెప్టెంబర్ 9 వరకు సవరణలు, 
  • కొత్త దరఖాస్తులకు చాన్స్‌‌‌‌.. అక్టోబర్ ​12న తుది జాబితా రిలీజ్‌‌‌‌
  • సర్ ​షెడ్యూల్‌‌‌‌ను సవరించిన ఎన్నికల కమిషన్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్సెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్ (సర్​)​ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ఎన్నికల సంఘం (ఈసీ) సవరించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం బూత్‌‌‌‌‌‌‌‌స్థాయి అధికారులు (బీఎల్‌‌‌‌‌‌‌‌ఓలు)  ఆగస్టు 3వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్​ ఫారాలు సేకరిస్తారు.  పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ ఆగస్టు 3వ తేదీ నాటికి పూర్తి చేస్తారు. అనంతరం ఆగస్టు 10న  రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా అధికారికంగా ప్రచురించనున్నారు. 

ఈ సవరణల ప్రక్రియపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.  వాస్తవానికి ముందుగా ఇచ్చిన షెడ్యూల్​ ప్రకారం ఈ నెల 24తో ఎన్యూమరేషన్​ దరఖాస్తుల సేకరణ పూర్తి కావాల్సి ఉంది.  తాజా షెడ్యూల్​ ప్రకారం ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు ప్రజలు తమ సవరణలు, కొత్త దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించేందుకు అక్టోబర్ 8 వరకు గడువు పొడిగించారు. 

అనంతరం సవరణలతో కూడిన తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 12న అధికారికంగా విడుదల చేయనున్నారు.  మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా  ఎన్యూమరేషన్​ ఫారాల పంపిణీ, వాటి డిజిటలైజేషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జులై 15  నాటికి అందిన నివేదిక ప్రకారం  డిజిటలైజేషన్ ప్రక్రియ  54.84 శాతానికి చేరుకోగా, మొత్తం 1,85,49,163 ఫారాలను కంప్యూటరీకరించారు. ఈ డిజిటలైజేషన్ పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

    పాత షెడ్యూల్      సవరించిన షెడ్యూల్
బీఎల్‌‌‌‌‌‌‌‌ఓల ఇంటింటి సర్వే     25.06.2026-24.07.2026    25.06.2026-03.08.2026
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ    24.07.2026 లోగా    03.08.2026 లోగా
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ     31.07.2026    10.08.2026 
అభ్యంతరాలు, క్లెయిమ్‌‌‌‌‌‌‌‌ల 
సమర్పణ గడువు    31.07.2026-30.08.2026    10.08.2026 – 09.09.2026
అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ    31.07.2026-28.09.2026    10.08.2026 – 08.10.2026
తుది ఓటర్ల జాబితా ప్రచురణ    01.10.2026    12.10.2026

©️ VIL Media Pvt Ltd.