Reading Time: < 1 minute
Rebel Fans Get Ready For Battle

టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఫస్ట్ లుక్ మినహా, ఇప్పటివరకు మరో అప్‌డేట్ ఇవ్వకుండా సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ‘స్పిరిట్’ షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. తన ఫోకస్‌ను ‘ఫౌజీ’ వైపు మళ్లించాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసేందుకు బల్క్ డేట్స్ కేటాయించినట్టుగా సమాచారం. అంతేకాదు.. వచ్చే నెలలో ‘ఫౌజీ’ టీజర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టీజర్‌తోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. నిజానికి వచ్చే దసరాకు ఫౌజీ రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు డిసెంబర్‌లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఓటీటీ బిజినెస్ పూర్తయిన వెంటనే అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారట. కాగా, ఈ పీరియాడిక్ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఫౌజీ ఎలా ఉంటుందో చూడాలి.