Reading Time: < 1 minute
Spirit Craze Prabhas Starrer Crosses 130k Bookmyshow Interests Beats Varanasi Dragon

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా రెబల్ స్టార్ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిన్న గ్యాప్ తర్వాత ప్రభాస్ మళ్లీ ‘స్పిరిట్’ సెట్స్‌లోకి అడుగుపెట్టినట్టుగా సమాచారం. ఈ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని టాక్. అక్కడ ప్రభాస్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో నమోదవుతున్న ఇంట్రెస్ట్స్‌ (Interests) లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ‘స్పిరిట్’ చిత్రం ఏకంగా 130k+ ఇంట్రెస్ట్స్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇప్పటి వరకు కేవలం ఒక్క పోస్టర్, ఆడియో గ్లింప్స్ మాత్రమే విడుదలైనప్పటికీ.. స్పిరిట్‌కు ఈ స్థాయి స్పందన రావడం విశేషం. ఇక రానున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చూస్తే.. ఎన్టీఆర్ డ్రాగన్ 78k+, మహేష్ బాబు ‘వారణాసి’ 62k+, అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రానికి 10k+ ఇంట్రెస్ట్స్‌ నమోదయ్యాయి. ఏదేమైనా.. ఈ గణాంకాలు చూస్తే ప్రస్తుతం స్పిరిట్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. ‘స్పిరిట్’ అప్పుడే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించే దిశగా ఈ చిత్రం అడుగులు వేస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి స్పిరిట్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.