
దశాబ్దాలుగా కోట్లాది మంది సినీ ప్రియులు ఎదురుచూస్తున్న కల నిజం కాబోతోంది. తమిళ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా భావించే ఇద్దరు లెజెండ్స్.. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. అదే ప్రతిష్టాత్మక చిత్రం ‘తలైవర్ 173’. ఈ సినిమాలో రజనీకాంత్ వెండితెరపై విశ్వరూపం చూపించబోతుంటే.. కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై ఈ మెగా ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.
‘డ్రాగన్’ డైరెక్టర్ ఎంట్రీ!
ఈ ప్రాజెక్ట్ వెనుక తెర వెనుక చాలా పెద్ద డ్రామానే నడిచింది. మొదట ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ సుందర్ సి తెరకెక్కిస్తారని టాక్ వచ్చింది. ఆ తర్వాత ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. కానీ, రజనీ-కమల్ ఇద్దరి ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేసే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం మేకర్స్ వెయిట్ చేశారు. ఫైనల్‌గా ఆ లక్కీ ఛాన్స్ గత ఏడాది ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్రాగన్’ చిత్రం డైరెక్టర్ అశ్వత్ మరిముత్తును వరించింది. ఈ విషయాన్ని అశ్వత్ బర్త్‌డే సందర్భంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అఫీషియల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సంక్రాంతి 2027 బరిలో!
ఇద్దరు లెజెండ్స్ తోడుగా.. యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తుకు ఇదొక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అనే చెప్పాలి. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. ఇప్పటికే రజనీకి ‘హుకుం’ అంటూ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన అనిరుధ్.. ఈ చిత్రానికి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తాడో ఊహించుకుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం శరవేగంగా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘తలైవర్ 173’ చిత్రాన్ని పొంగల్ (సంక్రాంతి) 2027 కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు కావడం ఖాయం అంటూ ఫ్యాన్స్ అప్పుడే కాలర్ ఎగరేస్తున్నారు.
From Imagination to Inspiration
Birthday wishes to Director @Dir_Ashwath#HBDAshwathMarimuthu #AshwathMarimuthu pic.twitter.com/3qoU2gV6EV— Raaj Kamal Films International (@RKFI) June 2, 2026