Reading Time: < 1 minute
వడదెబ్బ ధాటికి ఒక్కరోజే 23 మంది బలి..ఏపీలో పిడుగులతో కూడిన వర్షం

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 41.8 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం కూనవరంలో 41.6 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో 41.5 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, శ్రీకాకుళం జిల్లాలో వడదెబ్బ తీవ్రతకు గురై ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 155 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గురువారం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో గురువారం ఎండల తీవ్రత విపరీతంగా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత 43 నుంచి 44 డిగ్రీల వరకు చేరవచ్చు. మరోవైపు రాయలసీమ ప్రాంతాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా?

సనాతనధర్మం అంటే మతం కాదు..జీవన విధానం

బాబాయ్ నుంచి అబ్బాయికి తియ్యటి కబురు!

‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి..