Reading Time: < 1 minute
మన ఆర్థికవ్యవస్థకు..3 భయంకరమైన సవాళ్లు.. ఏమిటవి?

పెరుగుతున్న ముడి చమురు ధరలు, రానున్న’సూపర్ ఎల్ నినో’, అసాధారణ వడగాల్పులు, బలహీనమైన వర్షపాత అంచనాలు, వెరసి ఆహార ద్రవ్యోల్బణం.. ఇవన్నీ కలిసి 2026 ఆర్థిక సంవత్సరంలో భారతీయ గృహాలు, వ్యాపారాలు, దేశ ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఇలాంటి సమస్యను దేశం విడివిడిగా ఎదుర్కొని ఉండవచ్చు. కానీ, ఈ విపత్తులన్నీ ఒకేసారి ముంచుకొస్తే ఏమవుతుంది? అదే ఇప్పుడు ఆర్థికవేత్తలను కుదిపేస్తున్న ప్రశ్న. భారత ఆర్థిక వ్యవస్థ.. ఇప్పటికీ సరసమైన ధరలకు దొరికే ఇంధనం, స్థిరమైన రుతుపవనాలు, గ్రామీణ డిమాండ్‌పైనే ఎక్కువగా ఆధారపడి నడుస్తోంది. దురదృష్టవశాత్తూ, ఈ మూడూ ఇప్పుడు ఒకేసారి ఒత్తిడికి గురవుతున్నాయి.భారతదేశానికి తగలనున్న మొట్టమొదటి షాక్.. అంతర్జాతీయ చమురు సంక్షోభం. 2026లోకి అడుగుపెడుతూనే మన దేశం ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ సంక్షోభం కావడంతో ఈ సమస్యకు పరిష్కారం కూడా మన చేతుల్లో లేదు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన ‘హోర్ముజ్ జలసంధి’లో ఏర్పడిన అంతరాయాల కారణంగా, ముడి చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ప్రపంచ చమురు, ఎల్ఎన్‌జీ వాణిజ్యంలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుంది.

మరిన్ని వీడియోల కోసం :

పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా?

సనాతనధర్మం అంటే మతం కాదు..జీవన విధానం

బాబాయ్ నుంచి అబ్బాయికి తియ్యటి కబురు!

‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి..