Reading Time: < 1 minute
Vishwambhara Delay Megastar Chiranjeevi Fans Express Disappointment Over Lack Of Updates

ఈ ఏడాది ఆరంభంలోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే జోష్‌లో తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబీ దర్శకత్వంలో పట్టాలెక్కించేశారు. రీసెంట్‌గా గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా మరుసటి రోజు నుంచే షూటింగ్ మొదలుపెట్టుకుని ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కానీ అప్పుడెప్పుడో మొదలైన మెగాస్టార్ ‘విశ్వంభర’ పరిస్థితేంటి? ఏంటి అంటే క్లారిటీ లేకుండాపోయింది. చెప్పాలంటే మెగా అభిమానులు ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని దాదాపుగా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది.

‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. కానీ గ్రాఫిక్స్ వర్క్ డిలే కారణంగా గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ ఊసే వినిపించడం లేదు. ఆ మధ్యన సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా వెళ్లిపోతోంది అయినా కూడా ఇంతవరకు విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ లేకపోవడం గమనార్హం. కనీసం సినిమా రిలీజ్ ఎప్పుడు? టీజర్ లేదా సాంగ్స్ అప్‌డేట్స్ ఎప్పుడు? అనే కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దీనివల్ల ఈ సినిమా బజ్ క్రమంగా తగ్గిపోతోందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా కేవలం VFX పనుల వల్ల ఆలస్యమవుతోందా? లేక మరేదైనా కారణమా అనేది? హాట్ టాపిక్‌గా మారింది. మరి ‘విశ్వంభర’ పరిస్థితేంటో మేకర్స్‌కే తెలియాలి.