Reading Time: < 1 minute
Peddi First Trailer Gets Mixed Response Makers Plan To Release Second Trailer

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది ప్రమోషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి.జూన్ 4న పెద్ది వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌లో కేవలం పాటలు సినిమాపై హైప్ పెంచగా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఆశించినంత లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత డిజప్పోయింట్ అయ్యారు. ట్రైలర్ ఏమంత కొత్తగా లేదని అనేక సినిమాల రిఫరెన్సులు కనిపించాయని ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చింది.  ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పుడు ఒక పవర్‌ఫుల్ మాస్టర్ ప్లాన్‌ రెడీ చేస్తున్నారు.

సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సెకండ్ ట్రైలర్ అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ రిలీజ్ ట్రైలర్‌లో ఇప్పటివరకు చూపించని అసలు కథను రివీల్ చేయబోతున్నారట. ముఖ్యంగా ఈ చిత్రంలో హైలైట్‌గా నిలిచే ఎమోషన్ మరియు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఇంటెన్సిటీని ఈ సెకండ్ ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. కథలోని అసలైన సంఘర్షణ ఏంటనేది ఈ ట్రైలర్‌తో స్పష్టత రానుంది. అంతేకాదు ఈ పవర్‌ఫుల్ ట్రైలర్‌లో రామ్ చరణ్ అల్టిమేట్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ థియేటర్లలో విజిల్స్ వేయించే రేంజ్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, మరియు గూస్‌బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సెకండ్ ట్రైలర్ కట్ మెగా ఫ్యాన్స్‌కు థియేటర్లలో ఫుల్ మీల్స్ గ్యారెంటీ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సరికొత్త అస్త్రంతో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!