Reading Time: < 1 minute
Dmk Leader Anitha Radhakrishnan Slams Cm Vijay Tvk Government

DMK: తమిళనాడులో కొత్తగా ఏర్పడిన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ 6 నెలలు కూడా కొనసాగదని సీనియర్ డీఎంకే నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం అన్నారు. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తిరిగి వస్తారని ఆయన అన్నారు. ఇదే కాకుండా టీవీకేలో విజయ్ తర్వాత నెంబర్ 2గా ఉన్న అధవ్ అర్జున్‌కు ఆయన సవాల్ విసురుతూ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరుచెందూర్ నుంచి తనతో పోటీ పడాలని అన్నారు.

Read Also: Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!

గత 25 ఏళ్లుగా తిరుచెందూర్ నియోజకవర్గం రాధాకృ‌ష్ణన్‌కు కంచుకోటగా ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీఎంగా ఉన్న స్టాలిన్ సొంత నియోజకవర్గం కొలత్తూర్ ‌లో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ‘‘మా నేత స్టాలిన్ కొలత్తూరును సింగపూర్‌గా మార్చారు. ఆయన తిరుచి నుంచి పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాము’’ అని అన్నారు. సీఎం విజయ్ పెరుంబూర్, తిరుచి రెండు చోట్ల పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచారు. ఇటీవల ఆయన తిరుచి సీటుకు రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి.