Reading Time: < 1 minute
Ram Charan Peddi Movie Trailer Released June 4

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. ‘గేమ్ ఛేంజర్’ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో పాటు, ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి, ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఆ అంచనాలు మరింత పెంచేలా ప్రమోషనల్ కంటెంట్ ఉంటుంది.

ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, ఎట్టకేలకు జూన్ 4వ తేదీన రిలీజ్ కాబోతోంది. జూన్ మూడు సాయంత్రం ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇక రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచిన సినిమా టీం.. ఈరోజు ముంబై వేదికగా సినిమా ట్రైలర్‌ని అక్కడి మీడియాకి, ట్రేడ్ వర్గాలకు ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఇక అనంతరం యూట్యూబ్‌లో ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ట్రైలర్ మీద మీరు కూడా ఒక లుక్ వేసేయండి.