Reading Time: 2 minutes
Cinema: ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో మహేష్ బాబు సినిమా.. కట్ చేస్తే అల్ట్రా డిజాస్టర్.. ఏ మూవీనో తెలుసా?

సాధారణంగా సినిమా కథల ఎంపికలో హీరోలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. డైరెక్టర్ చెప్పిన కథ సూట్ అవుతుందా? అభిమానులకు నచ్చుతుందా? ఇలా చాలా సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఒక్కోసారి స్టార్ హీరోల అంచనాలు కూడా తారుమారు అవుతుంటాయి. ఎన్నో అంచనాలు, ఆశలతో చేసిన సినిమాలు కూడా అనూహ్యంగా బోల్తా పడుతుంటాయి. అలా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఒక సినిమా మహేష్ బాబు దగ్గరకు వెళ్లింది. అప్పటికే ఆ డైరెక్టర్ తనకు ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో మహేష్ చాలా నమ్మకంతో యాక్సెప్ట్ చేశాడు. స్టోరీ లైన్ కూడా ఇంట్రెస్ట్ గా ఉండడం, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉండడంతో భారీ అంచనాలతో సినిమా చేశాడు మహేష్.. కట్ చేస్తే.. ఆ సినిమా సూపర్ స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ మహేష్ అభిమానులు మర్చిపోలేదు. నిజం చెప్పాలంటే.. ఆ సినిమా మహేష్ బాబు సినిమా కెరీర్ లోనే ఒక పీడకల అని చెప్పుకోవచ్చు. మహేష్ అభిమానులను వణికించిన ఆ అల్ట్రా డిజాస్టర్ మూవీ మరేదో కాదు బ్రహ్మోత్సవం.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మహేష్ బాబుకు మంచి ఫ్యామిలీ హిట్ ఇచ్చాడు శ్రీకాంత్ అడ్డాల. దీంతో తన నెక్స్ట్ సినిమా బ్రహ్మోత్సవం కూడా మహేష్ బాబు తోనే చెశాడీ డైరెక్టర్. రిలీజ్ కు ముందు ఈ మూవీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కానీ తీరా రిలీజయ్యాక మాత్రం అసలు మహేష్ ఈ సినిమా ఎందుకు చేశాడ్రా? అని అభిమానులు ఫీలయ్యారు. అయితే ఈ బ్రహ్మోత్సవం సినిమాకు హీరోగా ఫస్ట్ ఛాయిస్ మహేష్ కాదట.
ఈ సినిమా కథ ముందుగా శ్రీకాంత్ అడ్డాల ఎన్టీఆర్‌కు చెప్పారట. ఎన్టీఆర్ కు కూడా ఈ స్టోరీ లైన్ తెగ నచ్చేసిందట. అయితే కొన్ని మార్పులు చేయమన్నారట. అందుకు తగ్గట్టుగానే శ్రీకాంత్ అడ్డాల కొత్త వెర్షన్ రెడీ చేసుకుని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాడట. అయితే కొత్త వెర్షన్‌ కూడా ఎన్టీఆర్‌ను మెప్పించలేకపోయిందట. దీనికి తోడు అప్పటికే తారక్ వరుస ఫ్లాపులతో సతమవుతున్నాడు. దీంతో రిస్క్ చేయడం ఎందుకుని బ్రహ్మోత్సవం సినిమాను పట్టించుకోలేదట. దీంతో శ్రీకాంత్ అడ్డాల ఇదే కథను మహేష్ కు చెప్పి ఒప్పించాడట. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా అల్ట్రా డిజాస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కనీస వసూళ్లు కూడా రాబట్టలేక నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది బ్రహ్మోత్సవం.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.