Reading Time: < 1 minute

రాజకీయ డ్రామాలు ఆపి.. అసెంబ్లీకి రండి: మంత్రి సీతక్క

Caption of Image.

అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన హడావిడి.. పోలీసులపై దౌర్జన్యం అంతా పొలిటికల్ డ్రామా అని.. రాజకీయా డ్రామాలు ఆపాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సూచించారు మంత్రి సీతక్క. అసెంబ్లీ అనేది ఫాంహౌస్ కాదని.. మీ ఫాంహౌస్ రాజకీయాలు అసెంబ్లీలో నడవవు అంటూ ఎద్దేవ చేశారు మంత్రి. చట్టాలు చేసే పవిత్రమైన, దేవాలయం లాంటి అసెంబ్లీకి.. ఫాంహౌస్ లో ఉండే విధంగా దుస్తులు ధరించి వస్తారా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు మంత్రి సీతక్క. 

రాష్ట్ర ప్రజల కోసం, సంక్షేమం కోసం.. రాష్ట్ర అభివృద్ధి కోసం అసెంబ్లీలో చర్చించాల్సిన ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ బయట ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని.. అసెంబ్లీకి రాకుండా ఎందుకు డ్రామాలు ఆడుతున్నారంటూ ప్రశ్నించారు మంత్రి సీతక్క.

బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు డ్రామా కంపెనీలుగా మారాయని.. సభ ప్రారంభం అయిన వెంటనే చర్చిస్తామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చినా.. బీజేపీ నిరసన చేయటం ఎందుకు అంటూ ప్రశ్నించారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు రాజకీయ రాద్దాంతం కావాలని.. అసెంబ్లీలో చర్చ జరగకుండా అడ్డుకోవాలనే కుట్రలో భాగంగానే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. 

►ALSO READ | దెబ్బ తాకిందా..? కేటీఆర్కు హరీష్ రావు పరామర్శ

ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉందా లేదా అంటూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ప్రశ్నించిన మంత్రి సీతక్క.. బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఎలాంటి నిబంధనలు పెట్టారో అందరికీ తెలుసు అని.. అప్పట్లో నియంతలా వ్యవహరించిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ చూశారంటూ గతాన్ని గుర్తు చేశారు మంత్రి సీతక్క.

బీఆర్ఎస్ పార్టీ పెట్టిన నిబంధనలు, నియమాలే ఇప్పుడు కొనసాగుతున్నాయని.. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినవి ఏవీ లేవని.. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు మంత్రి సీతక్క. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అసెంబ్లీకి వచ్చి సమస్యలపై మాట్లాడాలని.. అసెంబ్లీ బయటకు రాజకీయ డ్రామాలు ఆపాలంటూ హితవు పలికారు మంత్రి సీతక్క.

©️ VIL Media Pvt Ltd.