Reading Time: 2 minutes
Iqoo Z11xa 5g Launched In India 7200mah Battery 120hz Display 50mp Camera And More

iQOO Z11xa 5G: iQOO Z11 సిరీస్‌లో నాలుగో మోడల్‌గా iQOO Z11xa 5G భారత్‌లో లాంచ్ అయింది. కొత్త స్మార్ట్‌ఫోన్‌ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. 7,200mAh భారీ బ్యాటరీ, MediaTek Dimensity 7400 Turbo చిప్‌సెట్, 50MP కెమెరా వంటి ఫీచర్లను ఇందులో అందించారు. సెప్టెంబర్ 14 నుంచి అమెజాన్ ద్వారా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్:

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో 6.76-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఇది 1,080 x 2,344 పిక్సెల్స్ రిజల్యూషన్‌, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌, 382ppi పిక్సెల్ డెన్సిటీ, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, 83 శాతం NTSC కలర్ గ్యామట్‌తో వస్తుంది. ఫోన్‌ Vivo Origin 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రూపొందించారు. రెండు సంవత్సరాల OS అప్‌డేట్లు, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది. ఫోన్‌కు IP68 + IP69 రేటింగ్స్‌ ఉన్నాయి. దీంతో దుమ్ము, నీటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. గేమింగ్ కోసం AI గేమ్ వాయిస్ ఛేంజర్, 4D గేమ్ వైబ్రేషన్ వంటి ఫీచర్లను కూడా అందించారు.

ప్రాసెసర్‌, కెమెరాలు:

iQOO Z11xa 5Gలో MediaTek Dimensity 7400 Turbo ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గరిష్ఠంగా 8GB RAM అందుబాటులో ఉంటుంది. AnTuTu బెంచ్‌మార్క్‌లో ఈ ఫోన్‌ 8,90,000కుపైగా స్కోర్ సాధించిందని iQOO వెల్లడించింది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఉంది. కెమెరాల విషయానికి వస్తే.. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అందించారు.

బ్యాటరీ:

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,200mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌, బైపాస్ ఛార్జింగ్‌ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌, 93 గంటల వరకు ఆడియో ప్లేబ్యాక్‌, 15.4 గంటల గేమింగ్ లేదా 18.7 గంటల సోషల్ మీడియా వినియోగం సాధ్యమవుతుందని కంపెనీ పేర్కొంది.

ధర:

భారత్‌లో iQOO Z11xa 5G ధర రూ.28,999 నుంచి ప్రారంభమవుతుంది. ICICI Bank, HDFC Bank కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.1,500 ఫ్లాట్ కూపన్ డిస్కౌంట్ అందిస్తున్నారు. అదనంగా ఆరు నెలల వరకు No-Cost EMI సదుపాయం ఉంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 14 మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలకు రానుంది. ఇది ప్రిస్మాటిక్ గ్రీన్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.