Reading Time: 2 minutes

కార్ల రేట్లు రూ.20వేలు పెంచాలని మారుతీ సుజుకీ ఫిక్స్.. ఆటో లవర్స్ అస్సలు లేట్ చేయెుద్దు!

Caption of Image.

దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ వినియోగదారులకు గట్టి షాకిచ్చింది. మే నెల నుంచి వరుసగా ధరలను పెంచుకుంటూ వస్తున్న ఆ కంపెనీ.. తాజాగా మరోసారి కార్ల రేట్లను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. పెరిగిన ముడిసరుకుల ధరలు, ద్రవ్యోల్బణ భారాన్ని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. సెలెక్ట్ చేసిన కొన్ని కార్ల మోడళ్లపై రూ. 20వేల వరకు ధరలు పెంచినట్లు అధికారికంగా తెలిపింది. సెప్టెంబర్ 2026 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.

గతంలో తమ పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్ల మోడళ్లపై ధరలు పెంచిన మారుతీ సుజుకీ.. ఈసారి మాత్రం కేవలం కొన్ని ప్రత్యేక మోడళ్లపై మాత్రమే భారాన్ని మోపింది. ఏయే కార్ల మోడళ్లపై ధరలు పెరిగాయనే పూర్తి వివరాలను కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు. ప్రస్తుతం అరెనా నెట్‌వర్క్ కింద ఆల్టో కె10, వాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా వంటి కార్లను విక్రయిస్తుండగా.. నెక్సా శ్రేణిలో బాలెనో, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఫ్రాంక్స్ వంటి ప్రముఖ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి ఇతర ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు సైతం ఇప్పటికే తమ కార్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే.

ప్రొడక్షన్ కాస్ట్ వ్యత్యాసాలను తగ్గించుకోవడానికి తాము నిరంతరం ప్రయత్నిస్తున్నామని.. అయితే ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ధరల పెంపు తప్పనిసరి అయిందని మారుతీ సుజుకీ పేర్కొంది. ముడిసరుకుల భారాన్ని కొంతవరకు మాత్రమే వినియోగదారులపైకి మళ్లిస్తున్నామని, కస్టమర్లపై ప్రభావం కనీస స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కంపెనీ తెలిపింది. మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కూడా మారుతీ షేర్లు సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది.

ALSO READ : AI మనుషులను బ్లాక్ మెయిల్ చేయగలదా?

ఇదే సమయంలో ఆటోమోటివ్ సరఫరా లోకలైజేషన్ అవసరమని మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ హిసాషి టేకుచి చెప్పారు. గ్లోబల్ సప్లై చైన్ సమస్యలను అధిగమించడానికి, దేశీయ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్‌కు ఇది సరైన టైమ్ అని అభిప్రాయపడ్డారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూనే విదేశీ మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అప్పుడే రేట్ల భారం కార్ ప్రియుల జోబులపై భారం కాకుండా ఉంటుందని వెల్లడించారు. 

©️ VIL Media Pvt Ltd.