
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 2026 సెప్టెంబర్ 8 వ తేది శివ యోగం ఏర్పడుతుంది. సూర్య, చంద్రుల శుభ స్థానాలు, శుభ గ్రహాల బలం వల్ల ఏర్పడే అత్యంత పవిత్ర యోగమే శివ యోగమని పండితులు చెబుతున్నారు. అరుదైన యోగం, శివ శక్తి విపరీతంగా పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు .ఈ యోగంలో పరమశివుని పూర్తి అనుగ్రహం, అపారమైన సానుకూల శక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఈ యోగంలో చేసే పూజ సాధారణ రోజు కంటే 1000 రెట్లు ఫలితం ఇస్తుంది.మరి అలాంటి అద్భుతమైన రోజు ఏ రాశి వారు ఎలాంటి పూజ చేయాలో తెలుసుకుందాం. . .!
జ్యోతిష్య శాస్త్రంలో శివయోగానికి చాలా పవర్ ఉంది. ఆ రోజున ప్రతి రాశి వారు శివుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. అయితే12 రాశుల వారు తప్పనిసరిగా శివయోగం రోజు ( 2026 సెప్టెంబర్ 8) మూడు పనులు చేయాలని పండితులు చెబుతున్నారు.
- 1. ఉదయం శివాలయానికి పరమేశ్వరుని పంచామృతాలతో అభిషేకం, బిల్వపత్రాలతో పూజ, తెల్లని పూలతో అర్చించడం
- 2. ఓం నమః శివాయ నమ: అనే మంత్రాన్ని .. లేదా..
- మహా మృత్యుంజయ మంత్రం.. – ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం…
- ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్… 108 సార్లు జపం చేయాలి
- 3. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇచ్చి.. ఆశీర్వాదం తీసుకోవాలి. దానధర్మాలు చేయడం , ఉపవాసం, రాత్రి జాగరణ చేయాలి.
మేష రాశి : ఈ రాశి వారు శివయోగం శుభ సమయంలో నీళ్లలో ఎర్రగంధం మరియు బిల్వ పత్రాలు వేపి శివుడికి రుద్రాభిషేకం చేసి.. 11 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, వృత్తిలో పురోగతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: సెప్టెంబర్ 8 న శివయోగం ఏర్పడుతున్నందున ఈ రాశి వారు పరమేశ్వరుడి పచ్చిపాలతో అభిషేకం చేయాలి. పెరుగన్నం నైవేద్యం సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు పరిష్కారమయి.. ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి: ఈ రాశికి బుధుడు అధిపతి.. కావున శివయోగం సమయంలో పరమేశ్వరుడికి గరిక నీటితో అభిషేకం చేయండి. ఇలా చేయడం వలన నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, గుర్తింపు కలుగుతుంది.విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు తొలగుతాయి. గతంలో కోల్పోయిన సంపదను తిరిగి పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి : ఈ రాశికి చంద్రుడు అధిపతి. పాలతో శివుడిని అభిషేకం చేయడం. ఓంకారాన్ని జపం చేయండి. ఇలా చేయడం వలన కుటుంబంలో సమస్యలు తొలగుతాయి.
సింహ రాశి : ఈ రాశి వారు సెప్టెంబర్ 8 వ తేది పరమేశ్వరుడికి తేనెతో అభిషేకం చేయండి. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ శ్లోకం పఠించాలి. ఇలా చేయడం ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది.
కన్యా రాశి: ఈ రాశి వారు సెప్టెంబర్ 8 న శివయోగం వలన శ్రీశైల మల్లికార్జున సమేత భ్రమరాంభిక స్వామిని దర్శించండి. పరమేశ్వరుడికి మారేడు నీటితో అభిషేకం చేయండి. ఇలా చేయడం వలన జాతకంలో దోషాలు తొలగుతాయి. మనశ్శాంతి ఏర్పడుతుంది.
తులా రాశి : ఈ రాశి వారు పరమేశ్వరుడి దర్శించి.. పంచామృతాలతో అభిషేకం.. ఆ తరువాత పూల నీటితో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన భూలాభం కలుగుతుంది. స్థిరాస్థి వృద్ది చెందుతుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు పరమేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఎర్రని పూలతో పూజించాలి. ఇలా చేయడం వలన ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. ఆర్థికంగా వృద్ది చెందుతారు. ఆదాయం పెరగడంతో అప్పుల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
►ALSO READ | జ్యోతిష్యం:సెప్టెంబర్8 మహాఅద్భుతం..మూడు యోగాలు..శివపూజ..పాపాలు ఫట్.. ఐశ్వర్యం వృద్ధి
ధనుస్సు రాశి: శివయోగం( సెప్టెంబర్8) రోజున ఈ రాశి వారు పరమేశ్వరుడిని చెరుకురసంతో అభిషేకం చేయాలి. విష్ణు సహస్రనామం.. శివ సహస్రనామం పఠించాలి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు. ధనాభివృద్ది జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
మకర రాశి: ఈ రాశి వారు సెప్టెంబర్ 8న పరమేశ్వరుడికి భస్మాభిషేకం చేయాలి. నల్ల నువ్వులను దానం చేయాలి. ఇలా చేయడం వలన సర్వ పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంకా దాంపత్య జీవితంలో సుఖం.. ఉద్యోగంలో ఆటంకాలు తొలగడం.. వ్యాపారంలో లాభాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి : ఈ రాశి వారు పరమేశ్వరుడికి రుద్రాక్ష నీటితో అభిషేకం చేయాలి. పేదలకు అన్నదానం చేయాలి. శివయోగం రోజుఈ పరిహారాలు చేయడం వలన ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుంది. అప్పుల బాధలకు విముక్తి కలుగుతుంది.
మీన రాశి: ఈరాశి వారు శివుడికి పరమేశ్వరుడికి ఆవునెయ్యితో అభిషేకం చేయాలి. సెప్టెంబర్ 8 అర్దరాత్రి 12గంటలకుపంచాక్షరీ మంత్రాన్ని (ఓం నమ:శ్శివాయ) 108 సార్లు జపం చేయాలి. ఇలా చేయడం వలన అష్టైశ్వరాలు, మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.