Reading Time: < 1 minute
The Paradise Nani Srikanth Odela Release Date Confirmed Posters

The Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం అవుతోందని, సినిమా చెప్పిన సమయానికి రాకపోవచ్చంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఈ రూమర్లకు ఏకంగా వరుస అదిరిపోయే పోస్టర్లతో చిత్ర బృందం దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. ఈ భారీ చిత్రం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ తేల్చిచెప్పారు. ‘వాయిదా పడే ప్రసక్తే లేదు’ అనే సంకేతాన్ని ఇస్తూ విడుదల చేసిన ఈ కొత్త పోస్టర్లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతున్నాయి.

ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. పోస్టర్‌పై ప్రముఖంగా పేర్కొన్న ‘జడల్ జమానా షురూ’ (Jadal Zamaana Shuru) అనే హైలైట్. ఒక హీరో ఈ స్థాయి విచిత్రమైన, అత్యంత రా అండ్ రస్టిక్ రౌడీ లుక్‌లో కనిపించడం టాలీవుడ్‌లోనే తొలిసారి కావడంతో, ఇది నెట్టింట పెను సంచలనంగా మారింది. ఒక పోస్టర్‌లో వెనుక బ్లేడ్లు, గొలుసుల చక్రం మధ్య రెండు జడలతో గ్యాంగ్‌స్టర్‌లా కుర్చీలో పవర్ చూపిస్తుంటే.. మరో పోస్టర్‌లో శత్రువుల రక్తంతో తడిసిపోయిన దేహంతో ఆకాశం వైపు చూస్తూ విద్వంసకారుడిలా దర్శనమిచ్చారు. ఇంకో పోస్టర్‌లో వర్షంలో ఆయుధం భుజాన వేసుకుని బ్యాక్ పోజుతో మాస్ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లగా, హీరోయిన్‌ను ఎత్తుకుని డ్యాన్స్ చేస్తున్న ఫుల్ జోష్ లుక్ కూడా సినిమాలోని వైవిధ్యాన్ని స్పష్టం చేస్తోంది. ‘దసరా’తో మాస్ ఊచకోత ఎలా ఉంటుందో రుచి చూపించిన శ్రీకాంత్ ఓదెల, ఈసారి నానిని అంతకుమించిన క్రూరమైన, డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారని స్పష్టమవుతోంది. దానికితోడు అనిరుధ్ మ్యూజిక్ బలం తోడవ్వడంతో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.