Reading Time: 2 minutes

ఇంట్లో హాల్లో సోఫాలో కూర్చుని.. భోజనం చేస్తున్న తండ్రీ, కూతురు, అల్లుడు.. సడన్గా ఏమైందంటే..

Caption of Image.

రెప్పపాటు జీవితంలో కనుమరుగవుతున్న రోజులివి.. మన జీవితం ఎంత క్షణికమైందో కర్ణాటకలో జరిగిన ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఆగస్ట్ 22న రాత్రి 9 గంటల సయంలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో హాల్లో కూర్చుని తండ్రీ, తన కూతురు, అల్లుడు టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారు.

కూతురు, అల్లుడు సోఫాలో కూర్చుని తింటుండగా అదే సోఫా సెట్లో కొంచెం దూరంలో తండ్రి భోజనం చేస్తున్నాడు. తింటూ టీవీ చూస్తూ ఉండగా.. తండ్రికి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. అకస్మాత్తుగా సోఫాలోనే తింటూ కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన కూతురు పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వెళ్లింది.

కూతురి కేకలకు తల్లి కూడా వంట గదిలో నుంచి వచ్చింది. సోఫాలో ఉలుకూపలుకూ లేకుండా ఉన్న భర్తను చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. కూతురు తెలివిగా స్పందించి సీపీఆర్ చేసింది. అల్లుడు కూడా వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే.. వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయన చనిపోయాడని నిర్ధారించారు. ఊహించని ఈ పరిణామంతో బాధిత కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

►ALSO READ | డాక్టర్లపై దాడిచేసే రాజకీయనాయకులను అరెస్ట్ చేయాలె.. ఫ్రీగా తిరగనీయెుద్దు: సుప్రీం కోర్టు

హార్ట్ స్ట్రోక్​వచ్చిన వారిలో 50 శాతానికి పైగా హాస్పిటల్కు చేరకముందే చనిపోతుండటం మరింత ఆందోళన కలిగించే విషయం. ఈ ఘటనలో కూడా ఇదే జరిగింది. సివియర్​అటాక్​ కేసుల్లో హాస్పిటల్కు వచ్చాక కూడా 90 శాతం మరణించే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. ఛాతిలో నొప్పి వచ్చిన తర్వాత గంటలోగా హాస్పిటల్కు చేరితే ప్రాణాలను కాపాడే చాన్స్ ​ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కానీ.. సడన్ స్ట్రోక్.. నిమిషాల్లోనే ప్రాణాలు పోతున్న ఘటనలు పెరిగిపోతుండటంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.