
మే 04 వెల్లడైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ విజయ దుందుభికలు మోగించడంతో.. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ సినీ ప్రముఖులు విజయ్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. డిమాంటీ కాలనీ, కోబ్రా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన విజయ్ కు అభినందనలు తెలుపుతూనే ‘మాన్‌భూ..మిగు తమిళగ ముదల్వర్ అంటే గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి అనే పేరుతో జననాయగన్ సినిమాను త్వరగా విడుదల చేయండంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ఏడాదంతా సెలబ్రేషన్స్ చేసుకోవాలంటూ ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. అని పోస్ట్ చేశారు. విజయ్ ఫొటో కింద మాంభూమికి ముదల్వర్ అనే పేరుతో పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఎన్నికలకు ముందు విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్.. తెలుగులో జన నాయకుడు. హెచ్.వినోద్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే మమితాబైజు, ప్రియమణి కీలక పాత్రల్లో మెరిశారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా చేశాడు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సిన ఈ ససినిమా సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పుటికీ రిలీజ్ కాలేదు. అసలు ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్థితి. దీనికి తోడు ఈ సినిమ ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. అలాగే జననాయగన్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ కూడా ఈ సినిమాన వదిలేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ విజయం సాధించిన నేపథ్యంలో జననాయగన్ కు రిలీజ్ కు అడ్డంకులు తొలగినట్టేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Fauzi: ప్రభాస్ ఫౌజీ సినిమా టీంకు ప్రమాదం.. షూటింగ్‌కు బ్రేక్!
TVK Vijay: అప్పుడు NTR, ఇప్పుడు విజయ్! బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది..