
‘అమరన్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కమల్ హాసన్ బ్యానర్‌లో శివ కార్తికేయన్ హీరోగా మరో సినిమా రూపొందుతోంది. ‘సెయాన్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి బుధవారం హీరోయిన్‌ను ఫైనల్ చేశారు.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోందని తెలియజేశారు. తన బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. గాజుల షాప్ బ్యాక్‌డ్రాప్‌లో ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది భాగ్యశ్రీ. సుబ్రహ్మణ్యస్వామిని గుర్తుచేసేలా కూర్చున్న తీరు ఆమె పాత్రపై, సినిమాపై ఆసక్తి రేపుతోంది.
సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు అఖిల్‌కు జంటగా భాగ్యశ్రీ నటించిన ‘లెనిన్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తనకు బర్త్ డే విషెస్ చెబుతూ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్‌లో కిరీటం, మీసం, పౌరాణిక గెటప్‌లో భాగ్యశ్రీ ఆకట్టుకుంది.