Reading Time: < 1 minute

విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు… ప్రభుత్వ ఏర్పాటుకు ముందే సంఖ్యాబలాన్ని చూపాలన్న గవర్నర్…

Caption of Image.

తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి… ఎన్నికలు అయిపోయి, ఫలితాలు వచ్చినా కూడా పొలిటికల్ హీట్ ఏ మాత్రం తగ్గలేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడమే ఇందుకు కారణం. అయితే.. అందరికంటే ఎక్కువగా 108 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం లాంఛనం అనుకున్న సమయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అర్లేకర్ ఒప్పుకోలేదు.. దీంతో అన్ని ఏర్పాట్లు పూర్తైన తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయ్యింది.

ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ.. టీవీకే నేతలతో కలిసి గవర్నర్ వినతి పత్రం గవర్నర్ కు అందజేశారు విజయ్. ఇప్పటికే కాంగ్రెస్ విజయ్ కి మద్దతు ప్రకటించగా… వామపక్షాలు, IUML, వీకేసి పార్టీలు మద్దతు ఇవ్వమని తేల్చేశాయి. దీంతో సంఖ్యాబలం లేని కారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదు గవర్నర్.

►ALSO READ | విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ మెలిక : 118 మంది మద్దతు కావాల్సిందే అంటూ ఆదేశం

టీవీకే నేత అధవ్ అర్జున్ మరోసారి గవర్నర్ అర్లేకర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందే సంఖ్యాబలాన్ని చూపాలని కోరారు గవర్నర్. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని టీవీకే కోరగా… ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖత చూపలేదు గవర్నర్. దీంతో లోక్ భవన్ నుంచి వెళ్లిపోయారు అదవ్ అర్జున్. దీంతో గురువారం ( మే 7 ) జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయ్యింది. ఈ క్రమంలో తమిళనాట సీఎంగా ఎవరు ప్రమాణం చేస్తారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

©️ VIL Media Pvt Ltd.