Reading Time: 2 minutes

SRH vs PBKS: ఇ’షాన్ దార్ బ్యాటింగ్.. క్లాసెన్ క్లాసీ ఇన్నింగ్స్.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

Caption of Image.

కాటేరమ్మ కొడుకులు.. అనుకున్నట్లుగానే పంజాబ్ ముందు భారీ టార్గెట్ నిర్దేశించారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లు బాదుతూ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు హైదరాబాద్ బ్యాటర్లు. టాప్ ఆర్డర్ వీర బాదుడుకు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 రన్స్ చేసింది హైదరాబాద్. 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రేయాస్ సేన.. సన్ రైజర్స్ ను కట్టడి చేయడంలో విఫలమైందనే చెప్పాలి. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 38 (19 బాల్స్ లో 3 ఫోర్లు,3 సిక్సులు), అభిషేక్ శర్మ 35 (13 బంతులలో 2 ఫోర్లు, 4 సిక్సులు) తో పవర్ ప్లేను సద్వినియోగం చేసుకున్నారు. వీళ్లిద్దరి శాభారంభంతో  పవర్ ప్లే (0–6 ఓవర్లు) లో హైదరాబాద్ స్కోర్  79–1 కు చేరుకుంది. 

ఇక 3.3 వ ఓవర్లో ఫెర్గూసన్ బౌలింగ్ లో శ్రేయాస్ కు క్యాచ్ ఇచ్చిన అభిషేక్ ఔటయ్యాడు.  ఆ తర్వాత 6.4 ఓవర్ దగ్గర రెండో వికెట్ కోల్పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్.  చాహల్ బౌలింగ్ లో మార్కో జాన్సన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హెడ్ . 

హాఫ్ సెంచరీలతో చెలరేగిన కిషన్, క్లాసెన్:

ఓపెనర్లు ఔటయినా ఇషాన్ కిషన్ , క్లాసెన్ ఇన్నింగ్స్ ఆ ఊపును కొనసాగించారు. హాట్రిక్ సిక్సులతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇషాన్ కిషన్. 14వ ఓవర్ విజయ్ కుమార్ బౌలింగ్ లో చివరి మూడు  బంతులలో మూడు సిక్సులు బాది ఫిప్టీ మార్క్ అందుకున్నాడు. 29 బంతులలో 52 రన్స్ (2 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించాడు. 14.4 ఓవర్ లో అర్షదీప్ బౌలింగ్ లో సూర్యాన్ష్​ షెడ్జెకి క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరాడు. ఇక క్లాసెన్ తన క్లాసీ ఇన్నింగ్స్ తో హైదరాబాద్ కు భారీ స్కోర్ అందించాడు. 43 బంతులలో 3 ఫోర్లు, 4 సిక్సులతో 69 రన్స్ బాదాడు. 

కిషన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి..  ఎప్పట్లాగే భారీ సిక్సర్లు, ఫోర్లతో స్కోర్ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 13 బాల్స్ లో 29 రన్స్ చేసి భళా అనిపించాడు. మొత్తానికి కాటేరమ్మ కొడుకులు చెలరేగడంతో పంజాబ్ ముందు   ఓవర్లలో 236 రన్స్ భారీ టార్గెట్ నిర్దేశించారు. 

  • పంజాబ్ ఫీల్డింగ్ వైఫల్యం:

ఇక పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్, ఫెర్గూసన్, చాహల్, విజయ్ కుమార్ వైశాక్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. చాహల్ ఒక్కడే తక్కువ రన్ రేట్ (8) ఇచ్చాడు. పంజాబ్ ఫీల్డింగ్ లో చేసిన పొరపాట్లే హైదరాబాద్ కు కలిసొచ్చాయని చెప్పవచ్చు. ఇషాన్, క్లాసెన్ లాంటి కీలక బ్యాటర్ల క్యాచ్ లు మిస్ చేసుకోవడంతో.. లైఫ్ ను ఉపయోగించుకుని భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు ఈ హైదరాబాదీ బ్యాటర్లు.

©️ VIL Media Pvt Ltd.