జామకాయ జ్యూస్ కు కావలసిన పదార్థాలు: నాలుగు జామకాయలు, ఒక గ్లాస్ నీరు, ఒక టేబుల్ స్పూన్ చక్కెర లేదా ఒక టేబుల్ స్పూన్ తేనెను తీసుకోవాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , రుచికి సరిపడా ఉప్పు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ముందుగా జామకాయలను తీసుకుని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత గింజలను వేరు చేయండి.
ఒక వేళ ఇవి ఉన్నా కూడా అలాగే వాడొచ్చు. మిక్సీ జార్లో ఈ జామకాయ ముక్కలు, ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇంకా చివర్లో దీనిని వడకట్టాలి.
ఇంకా దీనిలో కొద్దిగా చక్కెర లేదా తేనె, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇంకా గ్లాస్లో పోసి చల్లగా సర్వ్ చేసుకోవాలి. ఇంకా దీనిలో ఐదు ఐస్ క్యూబ్స్ వేస్తే ఇంకా కూల్ అండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. తాగేటప్పుడు ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది.
ఇంకా దీనిలో కొద్దిగా పుదీనా వేసి బ్లెండ్ చేస్తే సూపర్ టేస్టీ ఉంటుంది. ఇంకా దీనిలో స్పైసీగా ఉండటం కోసం కొద్దిగా మిరియాల పొడి వేస్తే టేస్టీగా ఉంటుంది. ప్రయాణాల్లో వాంతులు అయ్యే వాళ్ళు దీనిని ఒక గ్లాస్ తాగితే చాలు. ఇంకా దీనిలో విటమిన్ సి ఉంటుంది.
రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది
జామకాయ జ్యూస్ లో చేయాలి కొంచెం ఉప్పు లేదా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే ఇంకా చాలా మంచిది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




