Reading Time: < 1 minute
Kidney Patients: కిడ్నీ రోగులు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? ఒకవేళ తాగితే ఏమవుతుంది..

నిపుణుల అభిప్రాయం ప్రకారం కొబ్బరి నీళ్లు సాధారణంగా ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇవి అంత మంచిది కాదు. రోగి మూత్రపిండాల వ్యాధి దశ, క్రియేటినిన్, పొటాషియం స్థాయిల ఆధారంగా దీని వాడకాన్ని నిర్ణయించాలి. రక్తంలో అధిక పొటాషియం స్థాయిలు ఉన్న మూత్రపిండాల రోగులు కొబ్బరి నీళ్లు తాగడం మానుకోవాలి. ఇది శరీరంలో పొటాషియంను మరింత పెంచి, ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. డయాలసిస్ చేయించుకుంటున్న వారు కూడా దీనిని సేవించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

ఎప్పుడు సురక్షితం?

తేలికపాటి మూత్రపిండాల సమస్యలు ఉండి పొటాషియం, క్రియేటినిన్ స్థాయిలు సాధారణంగా ఉన్నవారికి కొబ్బరి నీళ్లు తాగడం ప్రయోజనకరం. ఇది శరీరానికి తేమను అందించి, అవసరమైన ఖనిజాలను సమకూరుస్తుంది. కాబట్టి మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు తమ పరిస్థితిని బట్టి, వైద్యుని సలహా మేరకు మాత్రమే కొబ్బరి నీళ్లు తాగడం సురక్షితం.

మూత్రపిండాల ఆరోగ్యానికి ఈ నియమాలు పాటించండి..

  • రోజుకు 7–8 గ్లాసుల నీళ్లు తాగాలి.
  • ఉప్పు తీసుకోవడాన్ని నియంత్రించాలి.
  • ఫాస్ట్ ఫుడ్ తినడం మానుకోవాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

నోట్‌: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 తెలుగు ఈ విషయాలను నిర్ధారించడం లేదు. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.