లెజెండరీ యాక్టర్ చలపతిరావు గారికి బాలయ్య అంటే ప్రాణం. కొడుకు కంటే కూడా బాలయ్యకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని రవిబాబు సరదాగా అనడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎన్టీఆర్ కాలం నుండి ఈ కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం అటువంటిది. తండ్రికి ఇష్టమైన హీరోతో కొడుకు సినిమా తీస్తే చూడాలని మనందరికీ ఉంది కదా!
రవిబాబు అనగానే మనకు గుర్తొచ్చేది డిఫరెంట్ మేకింగ్, కొత్త తరహా కథలు. అటు బాలయ్య బాబు అంటే మాస్ కి మారుపేరు. ఈ ఇద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగిందట. బాలయ్య గారు ఒకసారి కాదు, రెండు మూడు సార్లు రవిబాబుని సీరియస్ గా అడిగారట.. “ఏమయ్యా, నాతో సినిమా చేయమని అడుగుతున్నా కదా, ఎప్పుడు చేస్తావు?” అని సరదాగా తిట్టారట కూడా! ఒక స్టార్ హీరో ఇలా స్వయంగా అడగడం అంటే రవిబాబు టాలెంట్ పై ఆయనకున్న గౌరవం అర్థమవుతోంది
బాలకృష్ణ గారు స్వయంగా పిలిచి సినిమా చేయమని అడగడం అంటే అది చిన్న విషయం కాదు. రవిబాబు వంటి విభిన్నమైన దర్శకుడికి బాలయ్య ఇచ్చే గౌరవం అది. ఒక పక్క మాస్ ఇమేజ్ ఉన్న హీరో, మరోపక్క ప్రయోగాత్మక దర్శకుడు.. వీరిద్దరూ కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. కానీ అన్నీ కుదిరినప్పుడే కదా సినిమా పట్టాలెక్కేది?
చాలా మంది దర్శకులు సురేష్ బాబు గారి దగ్గర స్క్రిప్ట్ ఓకే చేయించుకోవడానికే ఏళ్లు పడుతుందని భయపడుతుంటారు. కానీ రవిబాబు మాత్రం చాలా ఈజీగా ఏడు సినిమాలు చేసేశారు. ఇది కేవలం ఒకరి పనితీరుపై మరొకరికి ఉన్న నమ్మకం. ఐదు పేజీల వన్ లైన్ ఆర్డర్ తోనే సురేష్ బాబు గారు సినిమా ఓకే చేసేవారంటే రవిబాబు క్లారిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు
మిస్సైన క్రేజీ కాంబో కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు, కానీ జరిగినవి మంచికే అనుకోవాలి. రవిబాబు అప్పట్లో బాలయ్యతో సినిమా చేసి ఉంటే అది ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యేది. ఇప్పటికీ కాలం మించిపోలేదు, రవిబాబు దగ్గర బాలయ్య బాబు రేంజ్ మాస్ కథ ఉంటే, ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయం




