Reading Time: 2 minutes
Egg Test : మీరు కొన్న గుడ్డు తాజాదా? లేదా పాడైపోయిందా.. క్షణాల్లో ఇలా గుర్తించండి

గుడ్డు మన ఆరోగ్యానికి అనేక విదాలుగా ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది డాక్టర్లు కూడా రోజు ఓ గుడ్డు తినమని సిఫార్స్ చేస్తారు. కానీ ప్రస్తుతం కల్తీ ప్రపంచంలో మనం కొనే గుడ్లు నిజంగా తాజాగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. పగలగొట్టిన తర్వాత వాసన వస్తేనే చెడిపోయింది అని అనుకోవడం కంటే, ముందే తనిఖీ చేయడం ఉత్తమం. ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యల నుండి బయటపడటానికి, గుడ్డును వంటలో వాడే ముందు ఈ చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి మీరు వాడే గుడ్డు తాజాదో కుళ్లిపోయిందో క్షణాల్లో తెలుసుకోండి.

పాడైన గుడ్డును గుర్తించడం ఎలా?

నీటి పరీక్ష: ఒక గిన్నెలో నీటిని తీసుకుని గుడ్డును అందులో వేయండి. ఒక వేళ మీరు కొన్న గుడ్డు తాజాగా ఉంటే అది నీటి అడుగు భాగానికి వెళ్తుంది. కానీ గుడ్డు కిందకు వెళ్లకుండా నీటిపై తేలినా, లేదా నీటి అడుగునా నిటారుగా ఉన్నా అది పాడైపోయిందని అర్థం. ఎందుకంటే గుడ్డులోని గాలి బుడగ పరిమాణం పెరగడం వల్ల అది తేలుతుంది. కాబట్టి అలా తేలిన గుడ్డును మీరు అస్సలు తినకండి.

వాసన పరీక్ష: గుడ్డును నేరుగా పాన్ మీద పగలగొట్టకండి. ముందుగా ఒక చిన్న గిన్నెలోకి పగలగొట్టి వాసన చూడండి. తాజా గుడ్డుకు ఎటువంటి వాసన ఉండదు. ఒకవేళ అది పాడై ఉంటే, కుళ్ళిన వాసన లేదా ఘాటైన సల్ఫర్ వాసన వెంటనే వస్తుంది. అలా వాసన వస్తే దాన్ని తినడం ఆపేయండి

పెంకును తాకి చూడండి: గుడ్డు పెంకును మీ చేత్తో నిమిరి చూడండి. తాజాగా ఉన్న గుడ్డు పెంకు కొంచెం గరుకుగా లేదా సుద్దలా అనిపిస్తుంది. అదే గుడ్డు పాతబడే కొద్దీ దానిలోని తేమ ఆవిరైపోయి, పెంకు నునుపుగా లేదా మెరుస్తున్నట్లు మారుతుంది. అలాంటి గుడ్లను మీరు అస్సలు కొనకండి.

పచ్చసొన, తెల్లసొన గమనించండి: పగలగొట్టిన తర్వాత లోపలి భాగాన్ని గమనించండి. పచ్చసొన గుండ్రంగా, గట్టిగా ఉంటే అది తాజాగా గుడ్డు అని అర్థం. అదే తెల్లసొన చిక్కగా, పచ్చసొన చుట్టూ దట్టంగా ఉంటే అది పాడైపోయిందని అర్థం. పచ్చసొన సులభంగా పగిలిపోయినట్లు ఉంటే అది పాడైపోయినట్టే.

చెవితో ఊపి చూడండి: గుడ్డును మీ చెవి దగ్గర పెట్టుకుని మెల్లగా ఊపండి. అలా ఊపినప్పుడు ఎలాంటి శబ్ధం రాకపోతే ఆ గుడ్డు తాజాగా ఉంది అని ఆర్థం. అదే ఒక వేళ గుడ్డు లోపల నీళ్లలాగా శబ్దం వినిపిస్తే, ఆ గుడ్డు పాతబడినదని లేదా చెడిపోయినదని అర్థం. అలాంటి గుడ్లను మీరు ఎప్పుడూ కొనకండి.

ఉడకబెట్టిన తర్వాత పరీక్ష: ఒకవేళ పచ్చిగా ఉన్నప్పుడు మీకు అనుమానంగా ఉంటే, ఆ గుడ్డును బాగా ఉడకబెట్టండి. ఉడికిన తర్వాత కూడా ఏదైనా వింత వాసన వస్తుంటే, అది పాడైపోయినట్లే. అటువంటి గుడ్డును తినకుండా పారేయడమే ఆరోగ్యానికి మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.