
యూట్యూబ్ తన యూజర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ప్రీమియం సర్వీస్ గా ఉన్న పిక్చర్-ఇన్-పిక్చర్ సర్వీస్.. ఇక నుంచి ఫ్రీగా అందుబాటులోకి రానుంది. త్వరలోనే అందరికీ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెస్తామని యట్యూబ్ ప్రకటించింది.
- పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్ అంటే..
పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్ అంటే.. వేరే యాప్స్ వినియోగిస్తున్నపుడు కూడా యూట్యూబ్ చూసుకునే సౌకర్యం. వీడియో ప్లే అవుతుండగా సింపుల్ గా స్వైప్ చేసినా.. లేదా హోమ్ బటన్ ప్రెస్ చేసినా.. అది చిన్న ఫ్లోటింగ్ విండో కింద మారిపోతుంది. స్క్రీన్ పైన ఎక్కడైనా పెట్టుకుని చూడవచ్చు. మినీ ప్లేయర్ గా స్క్రీన్ లో ఎక్కడైనా ఉంచుకుని వేరే యాప్స్ ను విగియోగించవచ్చు. అంటే సింపుల్ గా ఇది మల్టీటాస్కింగ్ కు ఉపయోగపడుతుందన్నమాట.
PiP వద్దనుకుంటే.. వీడియోను పాస్ చేయడం, లేదా ఆపేయడం చేయాలి. ఒకవేళ ఈ ఫీచర్ సరిగ్గా పనిచేయకుంటే.. యాప్, డివైజ్ సెట్టింగ్స్ సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫీచర్ ఎనేబుల్ అయ్యిందో లేదో చూసుకోవాలి.
యాప్ సెట్టింగ్ లో ఆఫ్ చేసుకోవచ్చు.. కావాలంటే సెట్టింగ్స్ లో మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ లలో ఫోన్ సెట్టింగ్ నుంచి కంట్రోల్ చేయవచ్చు. యూట్యూబ్ వీడియో చూడటం అయిపోయింది అనుకున్నపుడు.. డైరెక్ట్ గా మినీ స్ట్రీన్ పైన క్లిక్ చేసి.. X సింబల్ పై క్లిక్ చేసి క్లోజ్ చేయవచ్చు.
ఇన్ స్టా మొదలైన యాప్స్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు యూజర్లకు మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి తెస్తోంది యూట్యూబ్. ప్లాట్‌ఫారమ్ షార్ట్స్ కోసం టైమ్ మేనేజ్ మెంట్ టూల్స్ ఇంట్రొడ్యూస్ చేసిన విషయం తెలిసిందే.