Reading Time: 2 minutes

Good Health:  షుగర్ లెవల్స్ కంట్రోల్ కావడం లేదా.. అయితే ఈ డైట్ మీకోసమే…. 

Caption of Image.

షుగర్​ తో  బాధపడేవాళ్లకోసం మార్కెట్లో రకరకాల పేర్లతో ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. మిల్లెట్స్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన పేరు. జొన్న గట్క గురించి వినే ఉంటారు. పచ్చ జొన్నలతో చేసే ఈ గట్క తింటే క్యాన్సర్ దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు. షుగర్ బాధపడేవాళ్లు దీన్ని రోజూ తినొచ్చు. మేక తలకాయ కూరతో జొన్నగట్క తింటే నుంచి రుచి కూడా ఉంటుంది. అది లేదంటే, ఉల్లిగడ్డ పులుసు కూడాషుగర్​ వ్యాధి ఉన్న వారికి బెస్ట్​ ఫుడ్​.. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ సండే ఈ పుడ్​ ను తిని ఎంజాయి చేయండి.  ఇంకెందుకు ఆలస్యం..ఎలా తయారు చేయాలో ఓ లుక్కేద్దాం. . .!

జొన్న గట్క తయారీకి కావలసినవి

  • పచ్చ జొన్న రవ్వ: ఒక కప్పు
  •  నీళ్లు: రెండు కప్పులు
  • ఉప్పు: తగినంత

జొన్న గట్క తయారీ విధానం

 గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ పై పెట్టి మరిగించాలి. తర్వాత జొన్న రవ్వ కొద్ది కొద్దిగా వేసి కలుపుతూ ఉడకబెట్టాలి. రవ్వ ఉడికాక ఉప్పు వేసి దించేయాలి. దీన్ని మజ్జిగ, చిన్న ఉల్లిగడ్డ పులుసు లేదా మేక మాంసంతో తింటే బాగుంటుంది.

మేక తలకాయ పులుసు తయారీకి కావాల్సినవి

  •  తలకాయ ముక్కలు: కిలోఉల్లిగడ్డ
  • ముద్ద: ఒక కప్పు
  •  జీలకర్ర: ఒక టీస్పూన్
  •  అల్లం , వెల్లుల్లి ముద్ద: ఒక టేబుల్ స్పూన్
  •  చింతపండు గుజ్జు: ఒక కప్పు 
  • కారం: రెండు టేబుల్ స్పూన్లు
  •  ధనియాల పొడి: ఒక టేబుల్ స్పూన్
  •  కొబ్బరి పొడి: ఒక టేబుల్ స్పూన్
  •  ఉప్పు: తగినంత
  •  నూనె: తగినంత

మేక తలకాయ పులుసు తయారీ విధానం

 మేక తలకాయ ముక్కలు శుభ్రం చేసి పక్కన పెట్టాలి. స్టవ్​ పై బాండీ పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి. జీలకర్ర వేసి వేగించి, ఉల్లిగడ్డ ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగించాలి.

పచ్చివాసన పోయాక తలకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు మగ్గించాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి మరికొద్ది సేపు మగ్గాక చింతపండు పులుసు వేసి ఉడికించాలి. పులుసు చిక్కబడ్డాక కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి రెండు నిమిషాలు ఉడికిస్తే ‘తలకాయ పులుసు’ రెడీ..

చిన్న ఉల్లిగడ్డ పులుసు తయారీకి కావలసినవి

  • చిన్న ఉల్లిగడ్డలు: కిలో
  • చింతపండు గుజ్జు: ఒక కప్పు
  • పసుపు: పావు టీ స్పూన్
  • జీలకర్ర: రెండు టీ స్పూన్లు
  • మెంతులు: ఒక టీ స్పూన్
  • పచ్చిమిర్చి: రెండు
  • ఎండు మిర్చి: రెండు
  • కరివేపాకు: రెండు రెమ్మలు
  • అల్లం ముద్ద: ఒక టీ స్పూన్
  • కారం: రెండు టేబుల్ స్పూన్లు
  • ధనియాల పొడి : ఒక టేబుల్ స్పూన్
  • కొబ్బరి పొడి: ఒక టేబుల్ స్పూన్
  • ఉప్పు: తగినంత
  • నూనె: తగినంత

చిన్న ఉల్లిగడ్డ పులుసు తయారీ విధానం

 ఉల్లిగడ్డలు పొట్టు తీసి శుభ్రం చేసి పక్కన పెట్టాలి. స్టవ్​ పై పాన్లో నూనె వేయకుండా జీలకర్ర, మెంతులు వేసి వేగించి పొడి చెయ్యాలి. స్టవ్​ పై  బాండీ పెట్టి నూనె వేడి చెయ్యాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కొద్ది సేపు వేగించి ఉల్లిగడ్డలు వెయ్యాలి.

పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత చింతపండు పులుసు వేసి ఉడికించాలి. పది నిమిషాలు ఉడికాక కొబ్బరి పొడి, జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి వేసి రెండు నిమిషాలు ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ‘ఉల్లిగడ్డ పులుసు’ రెడీ.

©️ VIL Media Pvt Ltd.