Reading Time: < 1 minute

విహారయాత్రలో విషాదం.. పడవ బోల్తాపడి నలుగురు మృతి..11 మంది గల్లంతు.!

Caption of Image.

మద్యప్రదేశల్ లోని  నర్మదా నదిలో విషాదం చోటుచేసుకుంది. జబల్‌పూర్ సమీపంలోని బర్గీ డ్యామ్ దగ్గర టూరిస్టులతో  వెళ్తున్న క్రూయిజ్ బోల్తా పడి నలుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు. 

అసలేం జరిగిందంటే.. సుమారు 30 మంది  టూరిస్టులతో  ప్రయాణిస్తున్న క్రూయిజ్..  చూస్తుండగానే బలమైన గాలులు వీచడంతో  అదుపు తప్పి నదిలో మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన  ఎమర్జెన్సీ బృందాలు  15 మందిని ప్రాణాలతో కాపాడాయి. అయితే  మరో 11 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు, స్థానిక యంత్రాంగంతో గాలిస్తున్నాయి.

జబల్‌పూర్ కలెక్టర్ రాఘవేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 15 మందిని రక్షించామని, మరో 11 మంది కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. ఆకస్మిక వాతావరణ మార్పులు, గాలుల తీవ్రతే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.క్షతగాత్రులను ప్రస్తుతం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో నర్మదా తీరంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

 

©️ VIL Media Pvt Ltd.