
Salil Arora No-Look Six: ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త హీరో దొరికాడు. అతడి పేరే సలీల్ అరోరా (Salil Arora). వేలంలో రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమైన ఈ అన్‌క్యాప్డ్ వికెట్‌కీపర్ కం బ్యాటర్, ఇప్పుడు తన ప్రదర్శనతో అందరికీ సమాధానం ఇచ్చాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ పై జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో అద్భుత ఫినిషింగ్ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.
సీజన్ ప్రారంభంలో వరుసగా తక్కువ స్కోర్లు, ఒత్తిడిలో అవుట్ కావడం వల్ల సోషల్ మీడియాలో అతని ఎంపికపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాంఖడేలో ముంబై ఇండియన్స్ తో జరిగిన 244 పరుగుల భారీ ఛేజ్ లో తన సత్తా ఏంటో బయటపెట్టాడు. ఛేజింగ్ లో 17వ ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి ఔట్ అయిన తర్వాత SRH పరిస్థితి కాస్త క్లిష్టంగా మారింది. ఇంకా 30కి పైగా పరుగులు అవసరమై ఉండగా అరోరా క్రీజ్ లోకి వచ్చాడు. మొదటి బంతినే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అద్భుత ఫోర్ కొట్టి తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పేసాడు.
అయితే మ్యాచ్ మొత్తం ఒకఎత్తయితే, టీమిండియా దిగ్గజ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అరోరా కొట్టిన సిక్స్ మరొక ఎత్తు. ప్రపంచ వ్యపథంగా ఉన్న దిగ్గజ బ్యాటమెన్స్ బుమ్రా బౌలింగ్ లో ఆడాలంటేనే కాస్త జంకుతారు. అలాంటిది చివరి 18 బంతుల్లో 24 పరుగులు అవసరమైన సమయంలో అరోరా బుమ్రా బౌలింగ్ లో భారీ “నో-లుక్” సిక్స్ కొట్టాడు. డీప్ స్క్వేర్ లెగ్ పైకి కొట్టిన ఆ షాట్ ప్రేక్షకులతో పాటు క్రికెట్ దిగ్గజాలకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. బంతి ఎక్కడికి వెళ్తుందో చూడకుండానే షాట్ పూర్తి చేయడం అతని కాన్ఫిడెన్స్ ఏంటో కనిపించింది.
అంతటితో ఆగని అరోరా చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో పూర్తి ఆధిపత్యం చూపించాడు. కవర్స్ వైపు ఫోర్, లాంగ్ ఆన్ పై భారీ సిక్స్, చివరికి విజయం సాధించే సిక్స్ తో మ్యాచ్‌ను ముగించాడు. కేవలం 10 బంతుల్లో 30 పరుగులు చేసి 300 స్ట్రైక్ రేట్‌తో నాటౌట్‌గా నిలిచి హాట్ టాపిక్ గా మారాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో అరోరా విమర్శకుల నోళ్లు మూయించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో బౌల్ట్, బుమ్రా, పాండ్య వంటి టాప్ బౌలర్లను ఎదుర్కొని జట్టును విజయాన్ని అందించడం నిజంగా హ్యాండ్సప్.
𝙉𝙊 𝙇𝙊𝙊𝙆. 𝙉𝙊 𝙁𝙀𝘼𝙍
Shot of extreme confidence from Salil Arora
Updates
https://t.co/ypWTkEr2Rc#TATAIPL | #KhelBindaas | #MIvSRH pic.twitter.com/hC8aoPTvCm
— IndianPremierLeague (@IPL) April 29, 2026

