Reading Time: < 1 minute

జూన్ 5 నుంచి టెన్త్ సప్లిమెంటరీ..మే 14 వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశం 

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: టెన్త్ అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి మంగళవారం తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30  వరకు ఉంటాయని చెప్పారు.

ఈ పరీక్షలకు అటెండ్ కావాలనుకునే విద్యార్థులు ఈ నెల 30 నుంచి మే 14 వరకు హెడ్మాస్టర్లకు ఫీజు చెల్లించాలని సూచించారు. లేట్ ఫీజు రూ.50తో సబ్జెక్టు ఎగ్జామ్ కు రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని వెల్లడించారు. 

టెన్త్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్  సప్లిమెంటరీ టైమ్ టేబుల్ –

తేదీ                          సబ్జెక్టు

05.06.2026     ప్రథమ భాష
06.06.2026     ద్వితీయ భాష 
07.06.2026      ఇంగ్లిష్
08.06.2026     మ్యాథ్స్ 
09.06.2026     ఫిజికల్ సైన్స్ 
10.06.2026    బయోలాజికల్ సైన్స్
11.06.2026     సోషల్ స్టడీస్ 
12.06.2026     ఓఎస్ఎస్​సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 

©️ VIL Media Pvt Ltd.