Reading Time: < 1 minute
నెగెటివ్ టాక్ వచ్చినా..  కలెక్షన్స్‌లో దుమ్ములేపుతున్న ‘మైఖేల్’

ఎన్నో అంచనాల మధ్య వరల్డ్ వైడ్ రిలీజ్‌ అయిన మైఖేల్‌ మూవీకి డే వన్.. షాకింగ్‌లీ, నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను చూసి కొందరు మైఖేలు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేస్తుంటే.. మరి కొందరు ఇంకా బాగా.. తీసి ఉండాల్సింది అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే ఇలాంటి టాక్స్‌ మధ్యలోనూ.. మైఖేల్‌ మూవీ… కలెక్షన్స్‌లో దుమ్ములేపడం ఇప్పుడు అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని షేక్ చేసిన పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ‘మైఖేల్’. ఇందులో మైఖేల్ జాక్సన్ అన్న కొడుకు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ చేశాడు. చిన్నాన్న డ్యాన్సుల దగ్గర నుంచి స్టైల్ వరకు ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్లు దింపేశాడు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు.. మూడు రోజుల్లోనే $217.4 మిలియన్ల కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం వసూళ్లు మొత్తం రూ.2049 కోట్లు. అయితే అత్యధిక వసూళ్లు సాధించిన బయోపిక్ రికార్డ్ ఇదివరకు ‘ఓపెన్ హైమర్’ పేరిట 180.4 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు దీన్ని అధిగమించిన ‘మైఖేల్’.. గ్లోబల్ వైడ్ సరికొత్త ఘనత సాధించింది. అయితే విడుదల ముందు రోజు ప్రీమియర్లు వేస్తే చూసిన చాలామంది.. ‘మైఖేల్’ బయోపిక్ అంతేం మెప్పించలేదని పెదవి విరిచారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైఖేల్ జాక్సన్ అభిమానులు మాత్రం ఆయన్ని చివరిసారి బిగ్ స్క్రీన్‌పై చూసుకోవాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇక్కడ అక్కడ తేడా లేకుండా థియేటర్లకు వెళ్లి సినిమాని చూస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Monalisa Bhosale: ప్రేమ – పెళ్లి – ఇప్పుడు గర్భవతి !! షాకు మీద షాకిస్తున్న మోనాలిసా

సుశాంత్ సూసైడ్ కేసులో.. ప్రియురాలు రియాకు బిగ్ రిలీఫ్‌

JD Chakravarthy: విష్ణు ప్రియతో రెండో పెళ్లి.. ఎట్టకేలకు నోరు విప్పిన జేడీ చక్రవర్తి