
బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ కు నితీష్ కుమార్ మంగళవారం తన రాజీనామా లేఖను అందజేశారు. 21 ఏళ్ల పాటు నితీష్ కుమార్ సిఎం పదవిలో కొనసాగారు. నితీష్ కుమార్ రాజీనామాతో కాసేపట్లో బీహార్ కొత్త సిఎం పేరు ప్రకటనున్నారు. సిఎం రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద, రేణుదేవిలు ఉన్నారు. కాగా, నితీష్ ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో సిఎం పదవి నుంచి తప్పుకున్నారు.